అఖిల్ కోసం మరో స్టార్ హీరోయిన్.. అస్సలు తగ్గడం లేదుగా

అక్కినేని యువ హీరో అఖిల్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా బాగానే అవకాశాలు అందుకుంటున్నాడు. అలాగే సినిమాల కోసం కూడా చాలానే కష్టపడుతున్నాడు గాని సరైన సక్సెస్ దక్కడం లేదు. అదే విధంగా అఖిల్ కి సెట్టయ్యే కథలు కూడా ఎక్కువగా రావడం లేదనే కామెంట్స్ వస్తున్నాయి. ఫైనల్ గా ఈ యువ హీరోకు సురేందర్ రెడ్డితో ఒక ప్రాజెక్ట్ సెట్టవ్వడంతో ఫ్యాన్స్ కొంచెం హ్యాపీగా ఫీలవుతున్నారు. అఖిల్ కూడా ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.

ఆ సినిమా కోసం అఖిల్ ఫిట్నెస్ లోనే కాకుండా నటనతో కూడా సరికొత్తగా ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం వర్క్ షాప్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ హీరో, హీరోయిన్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదని అనిపిస్తోంది. ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నా కూడా స్టార్ హీరోయిన్స్ వైపే ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు. ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కోసం లీడింగ్ హీరోయిన్ పూజా హెగ్డేతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.

Akkineni akhil upcoming movie heroine finalized

ఇక నెక్స్ట్ సురేందర్ రెడ్డి సినిమా కోసం హీరోయిన్ విషయంలో చర్చలు జరిపినపుడు మరో లీడింగ్ హీరోయిన్ రష్మీక మందన్నను సజెస్ట్ చేశాడట. ఇప్పటికే సినిమాకు అఖిల్ మార్కెట్ కి మించి బడ్జెట్ కేటాయించారు. ఇక రష్మీక అంటే ఆమెకు కోటికి పైగానే ఇవ్వాల్సి ఉంటుందని రూమర్స్ అయితే గట్టిగా వస్తున్నాయి.

ఇక అఖిల్ తో పాటు సురేందర్ రెడ్డి కూడా రష్మీకను ఫిక్స్ చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే మరొక అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అఖిల్ ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను విడుదలకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఇక జనవరిలోనే ఆ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X