అవాంఛిత గర్భాలు, అరక్షిత గర్భస్రావాలు, లైంగికసంబంధాల ద్వారా వ్యాప్తి చెందే రకరకాల ఇన్ ఫెక్షన్లు స్త్రీల జీవితాలను కబళించకుండా ఉండేందుకు ఫిమేల్ కండోమ్ వాడాలంటున్నారు అక్కినేని అమల. అంతర్జాతీయ దినం (మే 28) సందర్భంగా...ఆమె మీడియాతో మాట్లాడుతూ 'ఇది చాలా సున్నితమైన అంశం. హెచ్ ఐవికి సంబంధించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నపుడు మాకు తెలిసిందేమిటంటే అభం శుభం తెలియని అమాయకులైన స్త్రీలు హెచ్ ఐవి బారిన పడడానికి ప్రధాన కారణం కండోమ్ లాంటి సాధనాలు వాడకపోవడమేనని. వాడమని భర్తను అడగడం అందరికీ సాధ్యం కాదు. నన్నే అనుమానిస్తావా...అని ఆమెను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఆమే స్వయంగా వాడుకోగల ఒక సాధనం అందుబాటులోకి రావడం ఎంతైనా స్వాగతించదగ్గ పరిణామం. ఇప్పుడిక ఆమె ఆరోగ్యం ఆమె చేతుల్లోనే ఉన్నట్లు కదా..' అన్నారు.