అదరగొట్టిన అక్కినేని అమల... సెక్సీ లుక్‌తో శ్రియ
హైదరాబాద్: దాదాపుగా రెండు సంవత్సరాలు తర్వాత శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ద్వారా అక్కినేని అమల సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండగా, హీరోయిన్ శ్రియ సెక్సీ లుక్‌తో ఇందులో కనిపించనుంది. కొత్త నటీనటులైన అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగుణ్, జార, రస్మి, కావ్య, నవీన్, విజయ్, సంజీవ్, శ్రీరామ్‌లను స్టార్ కాంటెస్ట్ ద్వారా ఎంపిక చేశారు.
తాజాగా ఈచిత్రానికి సంబంధించిన న్యూ స్టిల్స్ విడుదలయ్యాయి. ఇంత వయసు వచ్చినా వన్నె తగ్గని అందంతో అక్కినేని అమల ఇందులో అదరగొట్టినట్లు ఆ ఫోటోలు చూస్తే స్పష్టం అవుతోంది. ఇక శ్రియ తనదైన సెక్సీ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది.
అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై చంద్రశేఖర్ కమ్ములతో కలిసి శేఖర్ కమ్ముల అందిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈచిత్రాన్ని ఆగస్టులో విడుదల చేద్దా అనుకున్నప్పటికీ పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి కాక పోవడంతో సెప్టెంబర్ 13న విడుదల చేయాలని నిర్ణయించారు.
పసితనం అనుభవాలు, జ్ఞాపకాలు మధురంగా వుంటాయని, ఆ మధుర స్మృతులతోనే ఈ చిత్రాన్ని నిర్మించే ప్రయత్నం చేశానని, చిన్న వయసులో వస్తున్న అనేక అనుమానాలకు పెద్దయ్యాక ఎలా విడిపోయి వాటికి సమాధానాలు దొరుకుతాయనేది చిత్రంలో సరికొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నామని దర్శకుడు చెబుతున్నాడు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీజె మేయర్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా: విజయ్ సి.కుమార్, ఆర్ట్: తోట తరణి, నిర్మాతలు: శేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ కమ్ముల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శేఖర్ కమ్ముల.


Click it and Unblock the Notifications











