అక్కినేని ఫ్యామిలీ కల..కల్లలేనా? రికార్డు దక్కదా?

By Bojja Kumar

అక్కినేని ఫ్యామిలోని మూడు తరాలకు చెందిన నటులు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్యలను ఒకే సినిమాలో నటింప చేస్తూ క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ ఓ సినిమా తీయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కథను కూడా సిద్దం చేసుకున్న కృష్ణవంశీ ఆ మధ్య నాగార్జునకు వినిపించగా...ఫస్ట్ హాఫ్ కు ఓకే చెప్పిన నాగ్, రెండో భాగంలో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందని సూచించారు. దీంతో సరే అని చెప్పిన కృష్ణవంశీ మళ్లీ ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రస్తుతం మొగుడు సినిమా షూటింగులో బిజీగా ఉన్న ఆయన, దీని తర్వాత నానితో ఓ సినిమా, ఆ తర్వాత మరో సినిమా కమిట్ అయ్యారు. అయితే కావాలనే కృష్ణవంశీ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారని, కథ మార్చాలని నాగ్ డిమాండ్ చేయడం కృష్ణవంశీకి నచ్చకనే ఇలా చేశారనే వాదన వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ నుంచి.

తమ కుటుంబంలోని మూడు తరరాల నటులు కలసి నటించాలని అక్కినేని ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఆశ పడుతోంది. ఈ సినిమా పూర్తయితే ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన మూడో సినిమా ఫ్యామిలీగా అక్కినే కుటుంబం రికార్డుల కెక్కనుంది. గతంలో ఇలాంటి ఫీట్ హాలీవుడ్ లో ప్రముఖ నటుడు డగ్లస్ ఫ్యామిలీ సాధించింది. 'ఇట్స్ రన్ ఇన్ ది ఫ్యామిలీ" సినిమాలో డగ్లస్, ఆయన కొడుకు, మనవడు కలిసి నటించారు. ఆ తర్వాత బాలీవుడ్ లో రాజ్ కపూర్ ఫ్యామిలీ ఈ ఘనత సాధించింది. రాజ్ కపూర్ తండ్రి పృథ్వీ రాజ్ కపూర్, రాజ్ కపూర్ కుమారుడు రణధీర్ కపూర్ కలిసి నటించారు.

వీరి తర్వాత ఆ ఘనత సాధించాలని ఉవ్విల్లూరుతోంది అక్కినేని ఫ్యామిలి. అయితే కృష్ణవంశీ వంశీ తరు చూస్తుంటే వారి కల కల్లలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే రికార్డు సంగతి దేవుడెరగు...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X