మనం 2లో మరో ఇద్దరు యువ హీరోలు.. స్టోరీ ఎంతవరకు వచ్చిందంటే?

అక్కినేని ఫ్యామిలిలో ప్రతి ఒక్కరు చిరకాలం గుర్తుంచుకునే సినిమాల్లో మనం ఒకటి. ఆ సినిమా అంటే వాళ్లకి ఎంత ఇష్టమో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు చివరి రోజుల్లో చేసిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టింది. అయితే చాలా రోజుల నుంచి ఆ సినిమాకు సీక్వెల్ తీయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇటీవల మరోసారి నాగార్జునతో ఆ ప్రాజెక్ట్ పై చర్చలు జరిపినట్లు సమాచారం.

మరింత గ్లామర్‌గా శృతి హాసన్.. క్రాక్ విజయంతో మరింత జోష్‌గా

మనం సినిమా వారిని దగ్గర చేసింది

మనం సినిమా వారిని దగ్గర చేసింది

దర్శకుడు విక్రమ్ కె కుమార్ వినూత్నంగా పలు సినిమాలను తెరకెక్కిక్చినప్పటికి మనం అతనికి ఇష్టమైన సినిమా. అక్కినేని ఫ్యామిలీ కూడా అతన్ని కుటుంబ సభ్యుడిగానే అభిమానిస్తుంది. ఆ ఫ్యామిలీలో ఎలాంటి వేడుకలు జరిగినా కూడా దర్శకుడు విక్రమ్ ఉండాల్సిందే. అంతగా మనం సినిమా వారిని దగ్గర చేసింది.

హలో హిట్టవ్వకపోయినా కూడా..

హలో హిట్టవ్వకపోయినా కూడా..

హలో సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్ అవ్వక్కపోయినా కూడా అక్కినేని ఫ్యామిలీ విక్రమ్ కె కుమార్ ను దూరం పెట్టలేదు. మళ్ళీ వెంటనే నాగ చైతన్యతో థాంక్యూ అనే సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యారు. ఇక చాలా రోజుల తరువాత మనం సీక్వెల్ కు సంబంధించిన రూమర్స్ చాలానే వైరల్ అవుతున్నాయి.

మెయిన్ లైన్ సిద్ధమైందట

మెయిన్ లైన్ సిద్ధమైందట

ఇటీవల దర్శకుడు విక్రమ్ నాగార్జునతో కలిసి ఒక స్టోరీపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కథ మెయిన్ లైన్ సిద్ధమైందట. అలాగే కొన్ని ఎపిసోడ్స్ పై కూడా క్లారిటీ ఇచ్చాడట దర్శకుడు. అయితే థాంక్యూ సినిమా అయిపోయిన తరువాత ఒక సీనియర్ రైటర్ తో కూర్చొని కథ మొత్తం సిద్ధం చేయించాలని అనుకుంటున్నారు.

ఈ సారి కుటుంబం మొత్తం..

ఈ సారి కుటుంబం మొత్తం..

అయితే ఈ సారి మరో ఇద్దరు హీరోలు కూడా ఎక్కువగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మొదట మనంలో అఖిల్ కేవలం గెస్ట్ రోల్ లో కనిపించాడు. ఇక సుశాంత్, సుమంత్ కు అవకాశం లభించలేదు. అయితే ఈ సారి నాగార్జున, చైతన్యలతో పాటు సుమంత్ సుశాంత్, అమల కూడా కథలో ఒక భాగం అయ్యేలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Recommended Video

Mahesh Babu, Krishna And Gautham Ghattamaneni To Come Together For A Movie?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X