ఇష్క్ దర్శకుడితో....అక్కినేని ఫ్యామిలీ మూవీ?

ప్రస్తుతం నాగార్జున 'షిరిడి సాయి' షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ రెడ్డి శ్రీసాయి కృప ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కీరవాణి ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 9 పాటల రికార్డింగును పూర్తి చేశారు. పరుచూరి బ్రదర్స్ డైలాగ్ రైటర్స్‌గా పని చేస్తుండగా, ఎస్. గోపాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. భక్త కిషోర్ ఈచిత్రానికి కథ సమకూర్చారు. 'రాజన్న' సినిమా తర్వాత నాగార్జున నటించిన 'డమరుకం' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











