twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇష్క్ దర్శకుడితో....అక్కినేని ఫ్యామిలీ మూవీ?

    By Bojja Kumar
    |

    akkineni family
    అక్కినేని ఫ్యామిలీలోని మూడు తరాల హీరోలైన నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్యలను ఒకే సినిమాలో చూపిస్తూ సినిమా రూపొందిస్తానని అప్పుడెప్పుడో దర్శకుడు కృష్ణవంశీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కృష్ణ వంశీ చెప్పిన స్టోరీ అక్కినేని ఫ్యామిలీని సంతృప్తి పరచక పోవడంతో ఆ ప్రాజెక్టు కాస్తా అటకెక్కింది. తాజాగా ఈ కాన్సెప్టు మరో దర్శకుడిగా చేతిలోకి మారింది. ఇష్క్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్ కుమార్ అక్కినేని ఫ్యామిలీ కోసం మంచి సబ్జెక్టు తయారు చేశారని, నాగార్జునకు కూడా కథ నచ్చడంతో తన సొంత బేనర్లోనే నిర్మించాలని డిసైడైనట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.

    ప్రస్తుతం నాగార్జున 'షిరిడి సాయి' షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ రెడ్డి శ్రీసాయి కృప ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కీరవాణి ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 9 పాటల రికార్డింగును పూర్తి చేశారు. పరుచూరి బ్రదర్స్ డైలాగ్ రైటర్స్‌గా పని చేస్తుండగా, ఎస్. గోపాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. భక్త కిషోర్ ఈచిత్రానికి కథ సమకూర్చారు. 'రాజన్న' సినిమా తర్వాత నాగార్జున నటించిన 'డమరుకం' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.

    English summary
    Akkineni family movie in Vikram kumar direction.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X