వైరల్ పిక్: వర్మ కటౌట్‌కు నాగ్ ఫ్యాన్స్ పాలాభిషేకం.. ఆఫీసర్ అట్టర్ ప్లాప్, అయినా ఎందుకో తెలుసా!

Recommended Video

Akkineni Fans Offers Palabhishekam To RGV Cutout

అక్కినేని నాగార్జున సినీ జీవితాన్ని మలుపు తిప్పిన దర్శకుడు రాంగోపాల్ వర్మ. అందులో ఎలాంటి సందేహం లేదు. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఎప్పటికి మరచిపోలేని చిత్రం శివ. ఈ చిత్రంతో నాగార్జున స్టార్ రేసులోకి దూసుకుని వచ్చాడు. ఆ తరువాత కూడా నాగార్జున కొన్ని మంచి చిత్రాలని వర్మ తెరకెక్కించాడు. కానీ ఈ మధ్య కాలంలో వర్మకు ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా లేదు. ఈ తరుణంలో నాగ్, వర్మ కాంబినషల్ ఆఫీసర్ చిత్రం తెరకెక్కింది. సూపర్ హిట్ కాంబినేషన్ కాబట్టి నాగార్జున అభిమానులు వర్మపై నమ్మకం ఉంచారు. కానీ ఆఫీసర్ చిత్రం అత్యంత దారుణంగా పరాజయం చెందింది. వర్మ గురించి తెలిసి కూడా నాగార్జున అతడితో సినిమా చేశారని ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

టాలీవుడ్ చరిత్రలోనే

టాలీవుడ్ చరిత్రలోనే

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు తొలి రోజే కోట్లల్లో షేర్ వసూళ్లు చేస్తాయి. కానీ ఆఫీసర్ చిత్రం ఫుల్ రన్ లో కూడా కనీసం ఒక కోటి దాటడం కష్టంగా ఉంది. అంతదారుణంగా ఈ చిత్రం పరాజయం చెందింది. ట్రేడ్ పండితులు ఈ చిత్రాన్ని టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా అభివర్ణిస్తున్నారు.

 వర్మ గురించి తెలిసే

వర్మ గురించి తెలిసే

గత కొన్ని చిత్రాలుగా వర్మ సంగతి పసిగట్టిన ప్రేక్షకులు నాగార్జున సినిమా అయినప్పటికీ కనీసం ఆఫీసర్ సినిమా థియేటర్స్ వైపుకూడా వెళ్ళలేదు. ఫలితంగా నాగ్ కెరీర్ లోనే అత్యంత దారుణమైన ఓపెనింగ్స్ నమోదయ్యాయి. తొలిరోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 47 లక్షలు మాత్రమే రాబట్టింది.

రాంగోపాల్ వర్మ కటౌట్‌కు పాలాభిషేకం

రాంగోపాల్ వర్మ కటౌట్‌కు పాలాభిషేకం

తాజాగా నాగార్జున అభిమానులు రాంగోపాల్ వర్మ కటౌట్ కు పాలాభిషేకం చేసిన ఘటన చోటు చేసుకుంది. ఆఫీసర్ చిత్రం అట్టర్ ప్లాప్ అయినా కూడా పాలాభిషేకం ఎందుకు చేశారనే డౌట్ రావడం సహజమే. ఇకనైనా అక్కినేని ఫ్యామిలీని వదిలేయాలని వేడుకుంటూ నాగ్ ఫాన్స్ ఆర్జీవీ కటౌట్ కు పాలాభిషేకం చేశారు.

అభిమానుల ఆందోళన అదే

అభిమానుల ఆందోళన అదే

వర్మ దర్శకత్వంలో అఖిల్ నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆఫీసర్ ప్రమోషన్స్ లో భాగంగా వర్మ, అఖిల్ మధ్య చర్చలు జరుగుతున్న విషయాన్ని నాగార్జున స్వయంగా అంగీకరించారు. ప్రస్తుతం అక్కినేని అభిమానుల ఆందోళన ఇదే. వర్మ ఎట్టి పరిస్థితుల్లో అఖిల్ తో సినిమా చేయకూడదని పాలాభిషేకం చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X