twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్కినేని కుటుంబంలో వరుస విడాకులు.. రెండో పెళ్లిపై సుమంత్ ఏమన్నారంటే?

    |

    ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా కొంతమంది జంటలు వారి దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు కూడా హఠాత్తుగా విడాకులు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక అక్కినేని కుటుంబంలో కూడా వరుసగా విడాకులు తీసుకోవడం ప్రతీసారి అభిమానులను షాక్ కు గురి చేసింది. ఇక రీసెంట్ గా సుమంత్ రెండో పెళ్లి అనే కాన్సెప్ట్ పై కూడా తనదైన శైలిలో క్లారిటీ ఇవ్వడం విశేషం.

    విడిపోవడమే మంచిది..

    విడిపోవడమే మంచిది..

    గతంలో ఎప్పుడు లేని విదంగా గత నాలుగైదు నెలల్లోనే చాలామంది సెలబ్రెటీలు వారి మ్యారేజ్ లైఫ్ కు గుడ్ బై చెప్పడం హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక కలిసి ఇబ్బంది పడే కన్నా కూడా విడిపోవడమే మంచిది అనే వారు కూడా ఉన్నారు. అయితే ఎంత కష్టం వచ్చినా సాల్వ్ చేసుకొని ఆలోచించి ముందుకు వెళదాం అనేవారు మాత్రం చాలా తక్కువగానే ఉన్నారు.

    అక్కినేని ఫ్యామిలీలో..

    అక్కినేని ఫ్యామిలీలో..

    అక్కినేని ఫ్యామిలీలో బ్రేకప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కినేని నాగార్జున మొదటి పెళ్లి అనంతరం విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆయన మేనల్లుడు కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నాడు. అనంతరం అక్కినేని వారసుల విషయంలో కూడా అలానే జరిగింది. నాగచైతన్య సమంత నుంచి విడిపోగా అఖిల్ ఎంగేజ్మెంట్ తరువాత బ్రేకప్ చెప్పేశాడు.

    సుమంత్ స్పందన

    సుమంత్ స్పందన

    ఇక అక్కినేని కుటుంబంలో నాగచైతన్య విడాకులు తీసుకున్న క్రమంలో సుమంత్ ఎవరు ఊహించని విధంగా స్పందించాడు. అంతే కాకుండా సుమంత్ రెండో పెళ్లి అనే కాన్సెప్ట్ కూడా చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చాడు. సుమంత్ 2004లో తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమెతో రెండేళ్లు మాత్రమే కలిసి ఉన్న సుమంత్ 2006లో విడాకులు తీసుకున్నాడు.

    విడాకులపై సుమంత్ సినిమా

    విడాకులపై సుమంత్ సినిమా

    ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సీనియర్ హీరో రెండో పెళ్లి కాన్సెప్ట్ పై తనదైన శైలిలో ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. అయితే సుమంత్ నటించిన మళ్ళీ మొదలైంది అనే సినిమా విడాకుల కాన్సెప్ట్ తోనే మొదలైంది. ఇక ఈ సినిమా ఈ నెల 11న జీ5 లో రిలీజ్ అవుతుండగా సుమంత్ రెండో పెళ్లి పై అలాగే విడాకులపై కూడా తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

    దురదృష్టవశాత్తు..

    దురదృష్టవశాత్తు..

    సుమంత్ మాట్లాడుతూ..ఈ రోజుల్లో విడాకులు తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. నాకు తెలిసిన చాలామంది కూడా విడాకులు తీసుకున్నారు. దురదృష్టవశాత్తు విడాకులు చాలానే కొనసాగుతున్నాయి. దురదృష్టవశాత్తు అనే పదం వాడకూడదు కానీ అలా జరిగిపోతున్నాయి అంతే.. అని సుమంత్ తెలిపారు.

    రెండో పెళ్లి..

    రెండో పెళ్లి..

    ఇక తన ఫ్యామిలీలో కూడా విడాకులు ఉన్నాయని చెప్పిన సుమంత్.. రెండో పెళ్లి అనేది కష్టమే అయినప్పటికీ కొంతమంది అడ్జస్ట్ అయ్యి ఉంటున్నట్లుగా వివరణ ఇచ్చారు. ఇక రెండో పెళ్లి కూడా ఫెయిల్ అయితే ఉన్న ఇమేజ్ సైతం పడిపోతుంది అనే ఆలోచనతో ఎలాగోలో ఆ మ్యారేజ్ లైఫ్ ను కొనసాగిస్తున్నారని సుమంత్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

    English summary
    Akkineni hero sumanth about divorce issue in present days..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X