డాన్స్ లలో ఆయనే నా ఆదిగురువు : చిరంజీవి

By Srikanya

హైదరాబాద్ : ''అందరూ చిరంజీవి బాగా డాన్సు చేస్తాడు అంటుంటారు. అయితే... ఆ విషయంలో నాలాంటి వాళ్లందరికీ అక్కినేని నాగేశ్వరరావు గారే స్ఫూర్తి. డాన్సుల్లో నాకు ఆయన ఆదిగురువు'' అని ప్రముఖ నటుడు, కేంద్ర పర్యటక శాఖ సహాయ (స్వతంత్ర) మంత్రి చిరంజీవి అన్నారు. అక్కినేని నాగేశ్వరావు 90వ పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం రాత్రి హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగాయి. రాష్ట్ర గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ ముఖ్య అతిథిగా హాజరై నాగేశ్వరరావుని గజమాలతో సత్కరించారు. జ్ఞాపికను చిరంజీవి అందజేశారు. లోకాయుక్త జస్టిస్‌ బి.సుభాషణ్‌ రెడ్డి ప్రత్యేక సన్మాన ఫలకం అందజేశారు.

చిరంజీవి మాట్లాడుతూ ''నటనకి నిలువెత్తు నిదర్శనం అక్కినేని నాగేశ్వరరావుగారు. ఆయనకి సన్మానం అంటే చరిత్రను గౌరవించుకొన్నట్టుగానే భావిస్తాను. ఆయనతో పరిచయం నా అదృష్టంగా భావిస్తుంటాను. మేమిద్దరం కలిసి ఒక సినిమా చేశాం. వ్యక్తిగతంగా ఆయనతో గడిపిన క్షణాలు నాకు తియ్యటి జ్ఞాపకాలుగా మిగిలిపోతుంటాయి. సాధారణమైన రైతు కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఎదిగారు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన బడిలో చదువుకోలేదు. తెలుగు సినిమాతల్లి ఒడిలో చదువుకొన్నారు. ఎందరెందరో సినిమా ప్రముఖుల్ని కలుసుకొని అనుభవాన్ని సంపాదించారు. ఉన్నత స్థానానికి ఎదిగి ప్రేక్షకుల మనసుల్లో చెరిగిపోని ముద్రవేశారు.

చిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా వెలుగొందారు. 'వయ్యారీ హంస నడకదానా...', 'కడవెత్తుకొచ్చిందీ...' అంటూ ఆయన చేసిన డాన్సులు చూస్తుంటే ఇప్పటికీ ఒళ్లు పులకరించిపోతుంటుంది. అభిమన్యుడికి యుద్ధ నైపుణ్యం తల్లి గర్భంలో ఉన్నప్పుడే వచ్చిందని పురాణాల్లో చెబుతుంటారు. అక్కినేని నాగేశ్వరరావుపై అభిమానం నాకు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పడిందేమో అనిపిస్తుంటుంది. మా అమ్మగారు ఆయనకి వీరాభిమాని. నేను మరో వారం రోజుల్లో పుడతాననగా అమ్మ పాలకొల్లులో 'అర్ధాంగి' సినిమా చూశారట. అమ్మ నిండు గర్భిణిగా ఉన్నప్పుడు నాన్నని సినిమాకి తీసుకెళ్లిందట. మధ్యలో చిన్న ప్రమాదం జరిగినా... ఏం ఫర్వాలేదు, నేను సినిమా చూస్తాను అని చెప్పారట. సినిమా చూసొచ్చాక వారం రోజులకి నేను జన్మించానట. ఎప్పుడూ నవ యువకుడిలా ఆలోచిస్తుంటారు అక్కినేని. ఆయన వ్యక్తిత్వం మహోన్నతమైనది. ఆయన నిజ జీవితంలో పోషించిన భర్త పాత్ర ఎంతో గొప్పది. అన్నపూర్ణమ్మకు చివరి క్షణాల వరకు ఒక మిత్రుడిలా మెలిగారు. ఆయన వందో పుట్టినరోజును జరుపుకోవాలి. ఆ వేడుకకీ నేను రావాలి'' అన్నారు.

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ''జీవితం అంటే ఏంటో నేర్పారు నాన్న. 'మనం' సినిమాలో మేం కలిసి నటిస్తున్నాం. మా కంటే నాన్న హుషారుగా పనిచేస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంటుంద''న్నారు. గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ మాట్లాడుతూ ''సినిమా చరిత్రలో ఓ ధృవతార అక్కినేని నాగేశ్వరరావు. ఇలాంటి వేడుకకి రావాలనగానే... దొరకునా ఇటువంటి సేవ అనుకొంటూ వచ్చాను. నేను పాఠశాలలో చదువుకొంటున్నప్పుడు ఆయన నటించిన 'మిస్సమ్మ', 'మాయాబజార్‌'లాంటి సినిమాలు చూశాను. అక్కినేని నాగేశ్వరరావు అనగానే ఇప్పటికీ అదే రూపం నా కళ్లముందు మెదులుతుంటుంద''న్నారు.

అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ ''నేను పెద్దగా చదువుకోలేదు, నమస్కారం ఎలా చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో పరిశ్రమలోకి అడుగుపెట్టాను. నన్ను చిత్ర పరిశ్రమే తీర్చిదిద్దింది. అందుకే ఎప్పటికీ ఈ పరిశ్రమకు కృతజ్ఞతగా ఉంటాను. ఆడవేషాలు వేసుకొంటూ జీవనం సాగిస్తున్న రోజుల్లో నన్ను బెజవాడలో ఘంటసాల బలరామయ్యగారు చూసి ఇలా పరిశ్రమలోకి తీసుకొచ్చారు. ఎంతోమంది దర్శకనిర్మాతలు అద్భుతమైన పాత్రలు ఇచ్చి నేను ఎదిగేందుకు దోహదపడ్డారు. పరిశ్రమను మదర్‌ ఇండస్ట్రీగా భావిస్తుంటాను. ఉన్నదాంట్లో సంతృప్తి చెందడం నా అలవాటు. మంచి మనసున్న మిత్రుల ఆశీర్వాదాలు నాకు ఉన్నాయి. అవే నాకు శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయ''న్నారు. ''స్థితప్రజ్ఞత కలిగిన గొప్ప వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. ఆయనంటే నాకు ఎంతో అభిమానం'' అన్నారు.

టి.సుబ్బరామిరెడ్డి. ఈ కార్యక్రమంలో వైజయంతీమాల బాలి, అమల, సి.నారాయణరెడ్డి, డి.రామానాయుడు, ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ ఎమ్‌.సత్యనారాయణరావు, అక్కినేని వెంకట్‌, యార్లగడ్డ సురేంద్ర, సుమంత్‌, సుశాంత్‌, నాగచైతన్య తదితరులు పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X