For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bangarraju Twitter Review: బంగార్రాజుకు అలాంటి టాక్.. ప్లస్ మైనస్‌లు ఇవే.. ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే!

  |

  'సోగ్గాడే చిన్ని నాయన' తర్వాత ఆ స్థాయిలో విజయాన్ని అందుకోవడంలో తడబడుతున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున. విజయాలు పరాజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలను చేస్తోన్న ఆయనకు మాత్రం పరాజయాలే ఎదురవుతున్నాయి. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూనే ఉన్నారు.

  ఈ క్రమంలోనే ఈ సారి ఎలాగైనా గట్టిగా కొట్టి మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావించిన నాగ్.. తన కొడుకు నాగ చైతన్యతో కలిసి డ్రీమ్ ప్రాజెక్టు 'బంగార్రాజు'లో నటించాడు. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్విట్టర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం పదండి!

  ‘బంగార్రాజు'గా తండ్రీ కొడుకు రచ్చ

  ‘బంగార్రాజు'గా తండ్రీ కొడుకు రచ్చ

  అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన చిత్రమే 'బంగార్రాజు'. కల్యాణ్ కృష్ణ రూపొందించిన ఈ సినిమా'సోగ్గాడే చిన్ని నాయన'కు సీక్వెల్‌గా తెరకెక్కింది. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా చేశారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున స్వయంగా నిర్మించారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

  అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన రష్మిక మందన్నా: వామ్మో తొలిసారి ఇంత ఘాటుగా కనిపించడంతో!

   అంచనాలు పెంచిన మూవీ అప్‌డేట్స్

  అంచనాలు పెంచిన మూవీ అప్‌డేట్స్

  తండ్రి కోడుకు కలయికలో వచ్చిన 'బంగార్రాజు' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ చిత్రం నుంచి ఏది విడుదలైన మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు రికార్డు వ్యూస్ వచ్చాయి. అలాగే, పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పొచ్చు.

  బిజినెస్ భారీ స్థాయి.. రిలీజ్ గ్రాండ్‌గా

  బిజినెస్ భారీ స్థాయి.. రిలీజ్ గ్రాండ్‌గా

  నాగార్జునకు, నాగ చైతన్యకు తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ మంచిగానే ఉంది. అందుకే 'బంగార్రాజు' మూవీ హక్కులకు పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 38 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. ఇక, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి 1300కి పైగానే థియేటర్లలో విడుదల అవుతోంది. నాగ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ నెంబర్స్ అని టాక్.

  దీప్తి, షణ్ముఖ్ ఫ్యాన్స్‌కు శుభవార్త: సంచలన నిజాన్ని లీక్ చేసిన తండ్రి.. ఇద్దరూ మళ్లీ కలుస్తారా!

  పక్కా సంక్రాంతి సినిమా అని ట్వీట్లు

  పక్కా సంక్రాంతి సినిమా అని ట్వీట్లు

  సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కింన 'బంగార్రాజు' మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోలు ఇప్పటికే పూర్తయ్యాయి. నాగార్జున, నాగ చైతన్య నటించిన ఈ సినిమాకు ఆరంభం నుంచే మంచి టాక్ వచ్చినట్లు ఇప్పటి వరకూ వచ్చిన ట్వీట్లను బట్టి అర్థం అవుతోంది. సినిమాపై చేసిన మెజారిటీ ట్వీట్లు దీనికి అనుకూలంగానే ఉండడంతో పాటు పక్కా సంక్రాంతి మూవీ అంటున్నారు.

  మూవీ ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ అలా

  మూవీ ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ అలా

  ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'బంగార్రాజు' మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ వచ్చిన ట్వీట్ల ప్రకారం.. ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయంతో పాటు మూడు కలర్‌ఫుల్ సాంగ్‌లతో కూడి ఏవరేజ్‌గా ఉంటుందట. ఇంటర్వెల్‌ ముందు ట్విస్ట్ అదిరిపోతుందట. ఇక, సెకెండాఫ్ అంతా నాగ చైతన్య, నాగ్ మాస్ యాక్టింగ్‌తో అదరగొట్టేశారట. క్లైమాక్స్ కూడా బాగానే ఉందని తెలుస్తోంది.

  బ్రాతో కనిపించి రెచ్చిపోయిన వర్షిణి: ఘాటు ఫోజులతో రచ్చ.. ఆమెనిలా చూస్తే షాక్ అవుతారు!

  బంగార్రాజు ప్లస్‌లు... మైనస్‌లు ఇవే

  బంగార్రాజు ప్లస్‌లు... మైనస్‌లు ఇవే

  'బంగార్రాజు' మూవీని చూసిన వాళ్లంతా ఇచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఇందులో నాగార్జున, నాగ చైతన్య నటన, కొన్ని మాస్ సీన్స్, కలర్‌ఫుల్ సాంగ్స్, హీరోల కాంబో సీన్స్ చాలా బాగున్నాయని అంటున్నారు. అలాగే, ఎమోషనల్ సన్నివేశాలు పండకపోవడం, స్క్రిప్టు ఫ్లాటుగా ఉండడం, స్క్రీన్‌ప్లే నెమ్మదిగా సాగడం వంటివి సినిమాకు మైనస్ అయ్యాయని వీక్షకులు చెబుతున్నారు.

  మొత్తంగా బంగార్రాజు ఎలా ఉంది?

  మొత్తంగా బంగార్రాజు ఎలా ఉంది?

  ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. అక్కినేని హీరోలు నటించిన 'బంగార్రాజు' మూవీ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగే సోషియో ఫాంటసీ డ్రామా అని తెలుస్తోంది. 'సోగ్గాడే చిన్ని నాయన' మూవీని దృష్టిలో పెట్టుకుని చూస్తే మెప్పించదని అంటున్నారు. ఏమాత్రం అంచనాలు లేకుండా వెళ్లిన ఆడియెన్స్‌ను మాత్రం బంగార్రాజు ఆకట్టుకుంటాడని చెబుతున్నారు.

  English summary
  Akkineni Nagarjuna and Naga Chaitanya Did Bangarraju Movie Under Kalyan Krishna Direction. Lets See This Movie Twitter Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X