twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫేస్ యాప్‌ను ఓడించిన నాగార్జున.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్

    |

    ప్రస్తుత పరిస్థితుల్లో జనాలు ఇంటర్నెట్‌కు బానిసలు అయిపోతున్నారు. చాలా మంది మొబైల్ ఫోన్‌లను పట్టుకుని అవే ప్రపంచంగా బతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏది కొత్తగా వచ్చినా వాడేస్తున్నారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌ యాప్ హవా నడుస్తోంది. జనం తాము ముసలివాళ్లైపోతే ఎలా ఉంటారో, ఆ ఫొటోలను ఈ యాప్ ద్వారా చూసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫేస్‌ యాప్ ఫొటోలు వెల్లువెత్తుతున్నాయి. ఈ యాప్ ఏ వ్యక్తి ఫొటోనైనా కృత్రిమ పద్ధతిలో వృద్ధుల ముఖంలా మార్చేయగలదు.

    ఈ యాప్‌ను సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు వాడుకుంటున్నారు. చాలా మంది నటీ నటులు ఫేస్ యాప్‌లో ఎలా ఉన్నామో చూసుకుంటున్నారు. ఇదే విషయాలను సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు ఈ తరహా పోస్టింగులు పెట్టారు. ఈ యాప్‌ వాడడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయని నిపుణులు వారిస్తున్నప్పటికీ ఎవరూ తగ్గడం లేదు. దీంతో ఫేస్ యాప్ చాలా ఫేమస్ అయిపోయింది. ఇది కూడా మంచిగా పని చేస్తుందని చాలా మంది అంటున్నారు.

    Akkineni Nagarjuna beat FaceApp

    అయితే, ఇదే యాప్ అక్కినేని నాగార్జున అందం ముందు ఓడిపోయింది. అవును.. మీరు చదవింది నిజమే. ఆయన భవిష్యత్‌ను అంచనా వేయడంలో ఫేస్ యాప్ విఫలమైంది. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో 2002లో 'మన్మథుడు'సినిమాలో వచ్చిన సమయంలో ఉన్న ఫొటోను యాప్ ద్వారా ప్రయోగించారు. దీంతో 2019లో నాగ్ ముసలి వాడు అయినట్లు అది చూపించింది. కానీ, నాగ్ మాత్రం ఇప్పటికీ హ్యాండ్సమ్‌గానే ఉన్నాడు. ఇదే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ప్రస్తుతం నాగార్జున నటించిన 'మన్మథుడు 2' సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు చేసుకుంటోంది. ఇది ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్' ఆదివారం నుంచి ప్రారంభం అవుతుంది. ఇందులో నాగ్ హోస్టింగ్ ఎలా ఉండబోతుంది అనే ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది.

    English summary
    Then we got social media exploding with FaceApp from the last two days as everyone is making their #oldage picture and sharing it. Nagarjuna's Manmadhudu 2 has started using this FaceApp to their advantage. Taking a picture of Nagarjuna from Manmadhudu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X