For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ సినిమా ఒరిజినల్స్ మిస్ అయ్యాయి.. రిలీజ్ ఆగిపోయింది: నాగార్జున సెన్సేషనల్ కామెంట్స్

|

తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగేశ్వర్రావు ఎన్నో మరపురాని చిత్రాలను మనకు అందించారు. ఆయన చూపిన బాటలోనే నాగార్జున.. ఆయన కుమారులు నాగ చైతన్య, అఖిల్ తదితర హీరోలు నడుస్తున్నారు. వీరిలో నాగార్జునకు ఎంతో ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. సీనియర్ హీరోనే అయినా లేడీ ఫ్యాన్స్ కూడా భారీ స్థాయిలో ఉన్న హీరో ఆయన. ఆరు పదుల వయసులోనూ ఏమాత్రం తరగని అందంతో కుర్రాళ్లకు పోటీగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన సరికొత్త ప్రయత్నం చేస్తున్నారు.

‘ప్రిజర్వేషన్, రిస్టోరేషన్‌' వర్క్‌షాప్‌

‘ప్రిజర్వేషన్, రిస్టోరేషన్‌' వర్క్‌షాప్‌

పాత కాలం నాటి సినిమాలు చూడాలంటే వాటికి సంబంధించిన ప్రింట్స్ దొరకకపోవచ్చు. దొరికినా వాటిలో చాలా వరకు పాడైపోయి ఉంటాయి. అందుకే ఆయా సినిమాలకు సంబంధించిన హార్డ్ డిస్క్‌లను ఒక్కచోట దాచి పెట్టాలనే ఉద్దేశ్యంతో అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్ పేరే ‘ప్రిజర్వేషన్, రిస్టోరేషన్‌'. మంగళవారం ఈ వర్క్‌షాప్ పోస్టర్‌ను నాగార్జునతో పాటు పలువురు ప్రముఖులు విడుదల చేశారు. అనంతరం ఎన్నో విషయాలను మీడియాతో పంచుకున్నాడు.

అమితాబ్ చెప్పారు

అమితాబ్ చెప్పారు

‘ప్రిజర్వేషన్, రిస్టోరేషన్‌' గురించి ఒక సందర్భంలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆయన సతీమణి జయా బచ్చన్ నాకు వివరించారు. ‘తమ సినిమాలను ఈ పద్దతి ద్వారానే స్టోర్ చేసుకుంటామని, మీరు కూడా అలాగే చేయమని వాళ్లు నాకు చెప్పారు. ఇక, అప్పటి నుంచి ఇది ప్రారంభించాలని డిసైడ్ అయిపోయాను. ఇందులో భాగంగానే ఈ వర్క్‌షాప్ ప్రారంభిస్తున్నాను. ఇందులో నాన్న గారి సినిమాలతో పాటు నావి కూడా స్టోర్ చేసుకుంటాను' అని నాగ్ వెల్లడించాడు.

 ఆ సినిమాల ప్రింట్లు లేనే లేవు

ఆ సినిమాల ప్రింట్లు లేనే లేవు

సినిమాలను దాచుకోవడం అనే ప్రక్రియ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు తన గత చిత్రాల తాలూకూ హార్డ్ డిస్క్‌లను పరిశీలించానని నాగార్జున తెలిపారు. ‘ఎందుకైనా మంచిది అని నేను నటించిన ఎవర్‌గ్రీన్ చిత్రాలు గీతాంజలి, నిన్నేపెళ్లాడతా, అన్నమయ్య, హలోబ్రదర్‌ హార్డ్ డిస్క్‌లు చెక్ చేశాను. వాటిని డీవీడీ, హార్డ్‌డిస్క్‌లో ఉంచాను కానీ. ప్రింట్‌ సరిగ్గా రావట్లేదు' అని నాగార్జున చెప్పుకొచ్చాడు.

 సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది

సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది

నాగార్జున కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాల్లో ‘శివ'ను ప్రధానంగా చెబుతుంటారు. ఈ సినిమా టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇంతటి ప్రభావం చూపిన సినిమా కావడంతో దీన్ని మరోసారి రిలీజ్ చేద్దామని నాగార్జున భావించాడట. ‘ఐదేళ్ల క్రితం శివ సినిమాను రీ రిలీజ్‌ చేద్దామనుకున్నాం. అయితే, ఒరిజినల్ ప్రింట్లు సరిగా లేవు. వాటిపై మరకలు ఉండడం కనిపించింది. దీంతో ఆ రిలీజ్ ఆగిపోయింది' అని ఆయన వివరించాడు.

 ‘మన్మథుడు 2' గురించి..

‘మన్మథుడు 2' గురించి..

నాగార్జున - గ్లామర్ డాల్ రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో యంగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిత్రం ‘మన్మథుడు 2'. మనం ఎంటర్‌ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వయకామ్‌ 18 స్టూడియోస్‌ పతాకాలపై నాగార్జున అక్కినేని, పీ కిరణ్‌ (జెమిని కిరణ్‌) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో లక్ష్మి, వెన్నెలకిషోర్‌, రావు రమేష్‌, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటించారు. ఈ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా నెగెటివ్ టాక్ దక్కించుకుంది.

English summary
Tollywood senior Hero Akkineni Nagarjuna's Annapurna Studios has collaborated with the Film Heritage Foundation to conduct a workshop on film preservation and restoration. The workshop will be held in December at Annapurna Studios.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more