Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు సమంత గురించి ఓ రహస్యం చెప్పిన నాగార్జున
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున - గ్లామర్ డాల్ రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్లో యంగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిత్రం 'మన్మథుడు 2'. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పీ కిరణ్ (జెమిని కిరణ్) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో లక్ష్మి, వెన్నెలకిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటించారు.
ఈ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. అయితే, ఇందులో నాగార్జున లుక్కు మాత్రం ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. పూర్తి ఫారెన్ బ్యాగ్డ్రాప్లో తీసిన ఈ సినిమా అడల్ట్ కంటెంట్ ఎక్కువైందన్న టాక్ వినిపించింది. అందుకే ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమా పట్ల ఆసక్తి చూపలేదు.
ఇదిలాఉండగా, స్వాతంత్ర్య దినోత్సవం, రాఖీ పండుగను పురస్కరించుకుని నాగార్జున ఓ న్యూస్ చానెల్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి చాలా మంది అభిమానులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 'మన్మథుడు 2' చిత్ర విశేషాలతో పాటు ఎన్నో అంశాలను వాళ్లతో పంచుకున్నాడు నాగ్. ఈ సమయంలోనే ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు నాగ్ ఫన్నీ రిప్లై ఇచ్చాడు.
ఓ అమ్మాయి మాట్లాడుతూ.. 'మీ ఇంట్లో ఎవరు ఎంటర్టైన్మెంట్ చేస్తారు' అని అడిగింది. దీనికి సమాధానం చెబుతూ 'మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా.. అఖిల్ ఆట పాటలతో ఎంటర్టైన్ చేస్తాడు. సమంత మాత్రం అందరినీ ర్యాగింగ్ చేస్తూ ఉంటుంది. ఇంట్లో చిన్న పిల్లలా అల్లరి చేస్తుంది. ఆమె అల్లరి తట్టుకోవడం మా వల్ల కాదు' అని చెప్పుకొచ్చాడు.