twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు సమంత గురించి ఓ రహస్యం చెప్పిన నాగార్జున

    |

    టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున - గ్లామర్ డాల్ రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో యంగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిత్రం 'మన్మథుడు 2'. మనం ఎంటర్‌ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వయకామ్‌ 18 స్టూడియోస్‌ పతాకాలపై నాగార్జున అక్కినేని, పీ కిరణ్‌ (జెమిని కిరణ్‌) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో లక్ష్మి, వెన్నెలకిషోర్‌, రావు రమేష్‌, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటించారు.

    ఈ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ దక్కించుకుంది. అయితే, ఇందులో నాగార్జున లుక్‌కు మాత్రం ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. పూర్తి ఫారెన్ బ్యాగ్‌డ్రాప్‌లో తీసిన ఈ సినిమా అడల్ట్ కంటెంట్ ఎక్కువైందన్న టాక్ వినిపించింది. అందుకే ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమా పట్ల ఆసక్తి చూపలేదు.

    Akkineni Nagarjuna comments about Samantha

    ఇదిలాఉండగా, స్వాతంత్ర్య దినోత్సవం, రాఖీ పండుగను పురస్కరించుకుని నాగార్జున ఓ న్యూస్ చానెల్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి చాలా మంది అభిమానులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 'మన్మథుడు 2' చిత్ర విశేషాలతో పాటు ఎన్నో అంశాలను వాళ్లతో పంచుకున్నాడు నాగ్. ఈ సమయంలోనే ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు నాగ్ ఫన్నీ రిప్లై ఇచ్చాడు.

    ఓ అమ్మాయి మాట్లాడుతూ.. 'మీ ఇంట్లో ఎవరు ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తారు' అని అడిగింది. దీనికి సమాధానం చెబుతూ 'మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా.. అఖిల్ ఆట పాటలతో ఎంటర్‌టైన్ చేస్తాడు. సమంత మాత్రం అందరినీ ర్యాగింగ్ చేస్తూ ఉంటుంది. ఇంట్లో చిన్న పిల్లలా అల్లరి చేస్తుంది. ఆమె అల్లరి తట్టుకోవడం మా వల్ల కాదు' అని చెప్పుకొచ్చాడు.

    English summary
    Akkineni Nagarjuna, Rakul Preet Singh and Jhansi starrer Manmadhudu 2 released 9th August. The movie Facing many problems with First day talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X