61ఏళ్ళ వయసులో నాగార్జున డేరింగ్ రిస్క్.. బిగ్‌బాస్‌తో పాటు ఆ పనులు కూడా..
కరోనా కేసులు పదుల సంఖ్యలో ఉన్నప్పుడు తీవ్ర భయానికి గురైన జనాలు ఇప్పుడు లక్షలు దాటుతున్నా లెక్క చేయడం లేదు. కరోనా వలన ఇంట్లోనే ఆగిపోతే బ్రతుకు గడవడం కష్టమైన తరుణంలో జాగ్రత్తగా అడుగులు వేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక సెలబ్రెటీలు చాలా వరకు షూటింగ్ లకు దూరంగానే ఉంటున్నారు. అయితే ఆరు పదుల వయసులో నాగార్జున డేరింగ్ స్టెప్ తీసుకున్నారు.

నాగార్జున కూడా అదే తరహాలో..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మెల్లమెల్లగా షూటింగ్స్ మోదలవుతున్నాయి. కొందరు దర్శకులు నటీనటులు కరోనా భారిన పడినప్పటికి ఎవరు ఆ విషయాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేసుకోవచ్చని ఒక డేరింగ్ నిర్ణయానికి వస్తున్నారు. ఇక నాగార్జున కూడా అదే తరహాలో అడుగులు వేస్తున్నారు.

బిగ్ బాస్ ద్వారా..
ఇటీవల 61వ వసంతంలోకి అడుగుపెట్టిన నాగార్జున వీలైనంత వరకు షూటింగ్స్ కి దూరంగానే ఉండాలని అనుకున్నారు. అయితే బిగ్ బాస్ తో జాగ్రత్తగా షూటింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని హోస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. ప్రోమో షూటింగ్స్ లోనే నాగ్ కి ఒక నమ్మకం ఏర్పడింది. జాగ్రత్తగా ఉంటే కరోనా భారిన పడకుండా ఉండవచ్చని డిసైడ్ అయ్యారు.

సినిమా షూటింగ్స్ కూడా
అందుకే నాగార్జున సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ కూడా మొదలుపెట్టేశారు. నాగార్జున నెక్స్ట్ వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సరికొత్త థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇంకొంచెం మిగిలి ఉండడంతో వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు.
Recommended Video

నమ్మకం ఏర్పడింది..
గతంలోనే ఒకసారి షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పటికి కరోనా కేసులు పెరగడం చూసి వెనుకడుగు వేశారు. ఇక ఫైనల్ గా బిగ్ బాస్ 4 షూటింగ్స్ చేయడంతో ఆయనకు ఒక నమ్మకం ఏర్పడింది. ఇక వైల్డ్ డాగ్ కోసం ప్రస్తుతానికి ఎక్కువమంది యూనిట్ సభ్యులు అవసరం లేదు. అందుకే కొన్ని ఎపిసోడ్స్ ని జాగ్రత్తగా పూర్తి చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











