అక్కినేని నాగార్జునకు అస్వస్థత.. ఏం జరిగిందంటే..

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున అస్వస్థతకు గురయ్యారనే వార్త అభిమానుల ఆందోళనకు గురిచేస్తున్నది. తాజాగా మన్మథుడు 2 సినిమాతో నాగ్ నవ మన్మథుడి అవతారం ఎత్తి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా కోసం మరింత అందంగా, యువకుడిగా కనిపించేందుకు ప్రత్యేకంగా ఆరోగ్య నియమాలను, ఫిట్‌నెస్ ప్రొగ్రాంపై దృష్టిపెట్టారు. అయితే ఈ అంశాలే నాగ్‌ అనారోగ్యానికి కారణమని తెలుస్తున్నది. అయితే మీడియాలో ప్రచారమవుతున్న వార్తలో ఎంత నిజమున్నదనే విషయంపై క్లారిటీ లేదు. వివరాల్లోకి వెళితే..

 మన్మథుడు 2 మూవీ కోసం

మన్మథుడు 2 మూవీ కోసం

మన్మథుడు 2 సినిమా కోసం నాగార్జున్ విపరీతంగా కసరత్తులు చేశారు. ఫిట్‌గా కనిపించేందుకు మోతాదుకు మించి ఎక్సర్‌సైజులు చేసినట్టు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు చెప్పకనే చెప్పాయి. అంతేకాకుండా డైట్ విషయంలో కూడా చాలా స్ట్రీక్ట్‌గా ఉండటం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపినట్టు సమాచారం.

 చేతికి గాయంతో ప్రమోషన్

చేతికి గాయంతో ప్రమోషన్

అలాగే మన్మథుడు 2 ప్రమోషన్‌లో చేతికి కట్టు కట్టుకొని రావడంంతో మీడియా ఆ విషయాన్ని అడిగింది. ఫిట్‌నెస్ కోసం బరువులు ఎత్తిన సమయంలో చేతికి చిన్న గాయం అయిందని చెప్పడం జరిగింది. అదే ఊపుతో ఫిట్‌నెస్ మరింత ఎఫర్ట్ పెట్టడం వల్ల కొంత అనారోగ్యం బారిన పడినట్టు తెలిసింది.

వైరల్ ఫీవర్‌తో నాగార్జున

వైరల్ ఫీవర్‌తో నాగార్జున

మన్మథుడు 2 రిలీజ్ తర్వాత నాగార్జున స్వల్ప అనారోగ్యానికి గురైనట్టు తెలిసింది. కొద్దిరోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్టు సమాచారం. ఇప్పడిప్పుడే నాగార్జున కోలుకొంటున్నట్టు తెలిసింది. అయితే తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం వల్ల అభిమానుల్లో కొంత గందరగోళానికి దారి తీసింది.

 నిరాశను పంచిన మన్మథుడు 2

నిరాశను పంచిన మన్మథుడు 2

ఇక రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన మన్మథుడు 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది. ఆఫీసర్ తర్వాత నాగార్జునకు అంతటి చేదు అనుభవం మన్మథుడు 2తో మిగిలింది. న్యూ జనరేషన్ సినిమాలు చేయాలనే నాగార్జున ఉత్సాహానికి కొంత కళ్లెం వేసినట్టే కనిపిస్తున్నది. తదుపరి‌గా సొగ్గాడే చిన్నినాయనా సీక్వెల్‌పై నాగార్జున దృష్టిపెట్టే అవకాశం కనిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X