»   » కాబోయే కోడలు సమంతను పరిచయం చేసిన నాగార్జున... (ఫోటోస్)

కాబోయే కోడలు సమంతను పరిచయం చేసిన నాగార్జున... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ బిజినెస్ మేన్ నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు స్వాతి వివాహం ఎంపి టి. సుబ్బిరామిరెడ్డి చెల్లెలు కొడుకుతో ఆదివారం గ్రాండ్ గా జరిగింది. నిమ్మగడ్డ ప్రసాద్ కు అత్యంత సన్నిహితుడైన నాగార్జున ఈ వేడుకకు ఫ్యామిలీతో హాజరయ్యారు.

కాగా... కొంత కాలంగా నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య ప్రేమ, పెళ్లి విషయం వార్తల్లో నలుగుతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ సమంతతో చైతన్య ప్రేమాయణం నడిపిస్తున్నాడనేది బహిరంగ రహస్యమే. అయితే ఇంత వరకు ఈ విషయం నాగార్జున గానీ, సమంత గానీ అఫీషియల్ గా వెల్లడించలేదు.

అయితే నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు పెళ్లి వేడుకలో ఈ విషయాన్ని నాగార్జున దాదాపుగా ఖరారు చేసినంత పని చేసారు. తన కాబోయే కోడలు సమంతను వెంటేసుకుని ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకలో నాగ చైతన్య, సమంత జంటగా చెట్టాపట్టాలేసుకుని అటూ ఇటూ తిరుగుతుండటం సెంటరాఫ్ అట్రాక్షన్ అయింది.

ఒక రకంగా చెప్పాలంటే తనకు కాబోయే కోడలిని ఈ వేడుక ద్వారా అందరికీ అఫీషియల్ గా పరిచయం చేసాడు నాగార్జున. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

నాగార్జున

నాగార్జున

తన కాబోయే కోడలు సమంతను వెంటేసుకుని ఈ వేడుకకు హాజరయ్యారు నాగార్జున.

చైతు-సమంత

చైతు-సమంత

ఈ పెళ్లి వేడుకలో నాగ చైతన్య, సమంత జంటగా అటూ ఇటూ తిరుగుతుండటం సెంటరాఫ్ అట్రాక్షన్ అయింది.

అఫీషియల్

అఫీషియల్

నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు స్వాతి పెళ్లి వేడుకగా ద్వారా నాగార్జున సమంతను అందరికీ తన కోడలుగా పరిచయం చేసినట్లు తెలుస్తోంది.

జోడీ సూపర్బ్

జోడీ సూపర్బ్

నాగ చైతన్య, సమంత జోడీ చూడముచ్చటగా ఉందని అంటున్నారంతా.

వదినమ్మతో..

వదినమ్మతో..

తనకు కాబోయే వదినమ్మతో అఖిల్ అక్కినేని....

చాలా క్లోజ్

చాలా క్లోజ్

నిమ్మగడ్డ ప్రసాద్ ఫ్యామిలీకి నాగార్జున చాలా క్లోజ్...

పెళ్లి వేడుక

పెళ్లి వేడుక

పెళ్లి వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న నాగార్జున, అమల

English summary
Akkineni Nagarjuna, Akkineni Akhil,Akkineni Naga chaitanya with Samantha attended for the Wedding for Nimmagadda Prasad's daughter Swathi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X