పీవీ సింధుకి నాగార్జున బహుమతి.. చాలా కాస్ట్లీ గురూ!

Recommended Video

Nagarjuna & V. Chamundeswaranath Gifts A Costly Car To PV Sindhu | చాలా కాస్ట్లీ గురూ!

అంత‌ర్జాతీయ బ్యాట్మింటన్ పోటీల్లో తెలుగు తేజం పీవీ సింధు విశేష ఖ్యాతి తెచ్చుకుంటోంది. గతంలో అనేక పతకాలు చేజిక్కించుకొని తన టాలెంట్ చూపించిన ఈమె.. ఇటీవలే జ‌రిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో స్వర్ణం గెలిచి భారత దేశ కీర్తి పతాకాన్ని ఎగరవేసింది. దీంతో దేశంలోని ప్రముఖులంతా ఆమెను అభినందిస్తూ శుభాకాంక్షలు వెల్లువెత్తించిన సంగతి తెలిసిందే.

పీవీ సింధు ప్రతిభకు గుర్తింపుగా..

పీవీ సింధు ప్రతిభకు గుర్తింపుగా..

ఈ నేపథ్యంలో ఆమె ప్రతిభకు గుర్తింపుగా ఓ విలువైన బహుమతిని అందించారు హీరో నాగార్జున. క్రీడల్లో ప్రతిభ చూపుతున్న అథ్లెట్స్‌కి గత కొంతకాలంగా చాముండేశ్వరినాథ్ విలువైన కార్లని బహూకరిస్తున్న విషయం తెలిసిందే. కార్పొరేట్ సంస్థలు, కొద్ది మంది స్నేహితులతో కలిసి అతను ఈ విధంగా క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నారు.

నాగార్జున చేతుల మీదుగా

నాగార్జున చేతుల మీదుగా

ఈ మేరకు ఈ రోజు (సెప్టెంబర్ 14) అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన కార్యక్రమంలో బీఎండబ్ల్యూ కారును అందజేశారు. నాగార్జున చేతుల మీదుగా ఈ కారు బహుకరించబడటం విశేషం. చాముండేశ్వరినాథ్ ఇప్పటి వరకూ ప్రతిభ కనర్చిన క్రీడాకారులకు 22 కార్లని అథ్లెట్స్‌కి బహూకరించగా.. ఇందులో ఏకంగా 4కార్లు పీవీ సింధుకే దక్కడం మరో విశేషం.

పీవీ సింధుపై ప్రశంసల వర్షం

పీవీ సింధుపై ప్రశంసల వర్షం

ఈ సందర్భంగా నాగార్జున కాసేపు మీడియాతో మాట్లాడిన నాగార్జున పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురిపించారు. తాను పీవీ సింధుకి పెద్ద అభిమానని తెలిపారు. ఆమె తనకు వ్యక్తిగతంగా తెలుసని, ఈ విషయం చెప్పడానికి గర్వపడుతున్నానని ఆయన అన్నారు.

కోచ్ గోపీచంద్‌కి అభినందనలు

కోచ్ గోపీచంద్‌కి అభినందనలు

దేశానికి ఛాంపియన్లని అందిస్తున్న కోచ్ గోపీచంద్‌కి అభినందనలు అని పేర్కొన్నారు నాగార్జున. సింధు తల్లిదండ్రులు (పీవీ రమణ, విజయ) దేశానికి ఓ అద్భుతమైన ఛాంపియన్‌ని అందించారని ఆయన అన్నారు. ఇక తన ప్రతిభను గుర్తిస్తూ ఈ కారును బహుకరించడం పట్ల తన ఆనందం వ్యక్తం చేసింది పీవీ సింధు.

మరికొద్ది రోజుల్లో బయోపిక్

మరికొద్ది రోజుల్లో బయోపిక్

మరోవైపు తెలుగు తేజం పీవీ సింధు బయోపిక్ రూపొందించేందుకు పనులు వేగవంతం చేశారని తెలుస్తోంది. ఈ బయోపిక్‌లో సమంత గానీ, దీపికా పదుకొనె గానీ లీడ్ రోల్ పోషిస్తుందని టాక్ నడుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే దీనిపై అఫీషియల్ సమాచారం రానుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X