»   » భక్తితో పాటు రక్తి కూడా... అదీ నాగార్జున స్టైల్ ( ఓం నమో ఫోటోస్)

భక్తితో పాటు రక్తి కూడా... అదీ నాగార్జున స్టైల్ ( ఓం నమో ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'. ఈ చిత్రంలో భక్తి రసంతో పాటు కాస్త రక్తి రసం కూడా చూపించబోతున్నారు.

సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్‌ లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. నాగార్జున కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బిజినెస్‌ జరుగుతోంది. ఓవర్సీస్‌ రైట్స్‌లో, శాటిలైట్‌ రైట్స్‌లో, ఇక్కడ అన్ని ఏరియాల్లో క్రేజీగా బిజినెసస్‌ జరుగుతోంది.


ఫిబ్రవరి 10న

ఫిబ్రవరి 10న

రాబోయే సినిమాల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్న సినిమా 'ఓం నమో వేంకటేశాయ'. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం గ్రాఫిక్‌ వర్క్‌ జరుగుతోంది. ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


హథీరామ్ బాబాగా

హథీరామ్ బాబాగా

అక్కినేని నాగార్జున హాథీరామ్‌ బాబాగా మరో అద్భుతమైన పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామిగా సౌరబ్‌జైన్‌ నటిస్తుండగా, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క కనిపించనుంది. జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్‌, విమలా రామన్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాకర్‌, రఘుబాబు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


ఓం నమో వెంకటేశాయ

ఓం నమో వెంకటేశాయ

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందిస్తున్న ఈ చిత్రానికి స్వరవాణి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్‌.గోపాల్‌రెడ్డి, జె.కె.భారవి, కిరణ్‌కుమార్‌, గౌతంరాజు ఇతర సాంకేతిక వర్గం.


కాంబినేషన్ క్రేజ్

కాంబినేషన్ క్రేజ్

నాగార్జున-రాఘవేంద్ర రావు కాంబినేషన్లో గతంలో అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి లాంటి సూపర్ హిట్ భక్తిరస చిత్రాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘ఓం నమో వెంకటేశాయ' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.


English summary
Combination of Akkineni Nagarjuna, Director K.Raghavendra Rao is known for delivering Devotional Classics like Annamayya, Sri Ramadasu, Shiridi Sai. They are coming with another Devotional film, 'Om Namo Venkatesaya'. A.Mahesh Reddy is producing this film under Sai Krupa Entertainment Pvt Ltd. Makers are planning to release this film worldwide on February 10th, 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu