Don't Miss!
- News
vastu tips: నట్టింట్లో కూర్చుని జుట్టు దువ్వుకుంటున్నారా? అరిష్టం.. ఎందుకంటే!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
జూబ్లీహిల్స్ సొసైటీ పార్కుకు నాగార్జున శంఖుస్థాపన.. వాల్గొ ఇన్ఫాఫ్రా ఎండీ శ్రీధర్ రావుతో కలిసి..
బిగ్‌బాస్ తెలుగు 4కు హోస్ట్‌గా అదరగొట్టిన అక్కినేని నాగార్జున వైల్డ్ డాగ్ తదితర చిత్రాల షూటింగులతో బిజీగా ఉన్నారు. తన బిజీ షెడ్యూల్‌కు కాస్త విరామం ప్రకటించిన మన్మధుడు క్రిస్మస్ వేడుకలతోపాటు సమాజ సేవలో కూడా పాల్గొంటున్నారు. తాజాగా జూబ్లి హిల్స్ సొసైటీ పార్కు కోసం జరిగిన శంకుస్థాపనలో వాల్గొ ఇన్‌ఫ్రా ఎండీ, సీఈవో శ్రీధర్ రావుతో కలిసి నాగార్జున పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 49లో కార్యక్రమంలో నాగ్ శంకుస్థాపన చేయగా, శ్రీధర్ రావు తదితరులు మొక్కలు నాటారు. ఆ తర్వాత అక్కడే చెట్టు కింద సేద తీరిన నాగ్ కాలనీవాసులతో మనసు విప్పి మాట్లాడారు. వేడుకలో పాల్గొన్న మాస్టర్ అబూ శ్రీని ఒడిలో కూర్చోబెట్టుకొని ముచ్చట పెట్టారు.

కాలనీలో మొక్కలు పెంచుతున్న తీరును చూసి ప్రశంసించారు. పచ్చదనం కోసం మరిన్ని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పరిసరాలను పచ్చదనంతో నింపుకోవడం మన బాధ్యత అంటూ నాగార్జున తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగార్జున స్నేహితుడు సతీష్‌రెడ్డి, అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు. పలువురు కాలనీవాసులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.