నమ్ముకున్న డైరెక్టర్‌కు హ్యాండిచ్చిన అక్కినేని హీరోలు.. ఆ సినిమా కష్టమేనా?

నాగార్జున కెరీర్‌లో భారీ హిట్ అందించిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయన'. 2016 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా.. జూనియర్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో', బాలయ్య 'డిక్టేటర్', శర్వానంద్ 'ఎక్స్‌ప్రెస్ రాజా' వంటి వాటితో పోటీని తట్టుకుని కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 'సోగ్గాడే చిన్ని నాయన' నాగార్జున కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో దీనికి సీక్వెల్ తీయాలని ప్లాన్ చేశారు.

ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ పేరైన 'బంగార్రాజు'తో సీక్వెల్‌ తీయడానికి సన్నాహాలు చేశారు నాగ్, కల్యాణ్‌లు. ఈ మేరకు స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయింది. అంతేకాదు, ఈ సినిమాలో తనతో పాటు తన కుమారుడు నాగ చైతన్య కూడా నటించబోతున్నాడని నాగార్జున గతంలో ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అలాగే నాగ్‌కు జోడీగా పూజా హెగ్దే, చైతూ సరసన కీర్తీ సురేష్ నటిస్తారని కూడా వార్తలు వచ్చాయి.

Akkineni Nagarjuna, Naga Chaitanyaa Gave Hand To Kalyan Krishna

దీంతో ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, కొద్దిరోజుల క్రితం ఈ సినిమా కథ విషయంలో నాగ్ అసంతృప్తిగా ఉన్నారని, దీంతో దర్శకుడు మరో స్క్రిప్టును రెడీ చేస్తున్నాడని గుసగుసలు వినిపించాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. 'బంగార్రాజు' ప్రాజెక్టును అక్కినేని హీరోలు పూర్తిగా పక్కన పెట్టేశారనేదే ఆ వార్త సారాంశం.

ప్రస్తుతం నాగార్జున 'మన్మథుడు-2' షూటింగ్ తుది దశకు చేరుకుంది. అలాగే ఆయన తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్' కోసం సన్నద్ధం అవుతున్నారు. మరోవైపు, నాగ చైతన్య కూడా విక్టరీ వెంకటేష్‌తో కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ 'వెంకీ మామ'తో బిజీగా ఉన్నాడు. వీళ్లిద్దరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో కల్యాణ్ కృష్ణకు హ్యాండిచ్చినట్లేనన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. చైతూ ఈ సినిమా తర్వాత ఖాళీ అయినా.. నాగ్ మాత్రం వంద రోజుల పాటు 'బిగ్‌ బాస్'తో గడపాలి. సో.. ఇక ఈ సినిమా కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X