షారుక్ వ్యాఖ్యలపై ప్రశ్న: మీడియా మైకులను తోసేసిన నాగార్జున
హైదరాబాద్: దేశంలో మత అసహనం పెరుగుతోందన్న వ్యాఖ్యలపై స్పందించేందుకు నాగార్జున నిరాకరించారు. ఈ విషయమై ఆయన్ను మీడియా వారు ప్రశ్నించగా సమాధానం ఇవ్వడానికి ఇష్టపడని ఆయన మీడియా మైకులను తోసుకుంటూ వెళ్లిపోయారు.
షారూక్ ఖాన్ నిన్న తన 50వ పుట్టిన రోజువేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దేశంలో పెరుగుతున్న 'మతపరమైన అసహనం'పై మాట్లాడారు. ఈ విషయంలో రచయితలు అవార్డులు వెనక్కి ఇవ్వడాన్ని ఆయన స్వాగతించారు.

ఈ నేపథ్యంలో మీడియాకు తారసపడ్డ నాగార్జునను ఈ విషయమై స్పందించాలని కోరగా.... మత అసహనంపై మాట్లాడేందుకు నాగార్జున నిరాకరించారు. సున్నితమైన అంశం కావడం, తాను ఏం మాట్లాడినా మళ్లీ అదో పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం ఉండటంతో నాగార్జున నిరాకరించినట్లు స్పష్టం అవుతోంది.


Click it and Unblock the Notifications











