నాగార్జున అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 50కథలు విన్నా ఒప్పుకోలేదు?

సీనియర్ హీరోలందరు 60లో సినిమాల జోరు పెంచుతుంటే నాగార్జున మాత్రం నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. తొందరపడకుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. మన్మథుడు 2 డిజాస్టర్ కావడంతో నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని నాగ్ గత కొన్ని నెలలుగా అనేక రకాల కథలు విన్నారట.

నవమన్మథుడు..

నవమన్మథుడు..

అక్కినేని అందగాడిగా మన్మథుడు అనే అనే బ్రాండ్ సెట్ చేసుకున్న నాగార్జున 60లో ఉన్నాడు. వయసు ఎంత పెరుగుతున్నా కూడా నేటితరం కుర్రాళ్ళ కంటే ఎనర్జిగా కనిపించడం ఆయనకే సాధ్యం. ఇక ప్రయోగాలు చేయడంలో నాగ్ ముందుటాడు. వ్యాయామం చేసుకుంటూ ప్రతి రోజు కూల్ గా కనిపించే నాగ్ వెండితెరపై కనిపించి చాలా కాలమైంది.

 అదే చివరి హిట్టు..

అదే చివరి హిట్టు..

భారీ అంచనాల నడుమ విడుదలైన నాగార్జున మన్మథుడు 2 సినిమా అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. అంతకుముందు వచ్చిన వచ్చిన సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. నాగ్ చివరగా హిట్టు చూసింది 2016లో.. సోగ్గాడే చిన్న నయన బాక్సాఫీస్ హిట్టవ్వగా ఆ తరువాత వచ్చిన ఊపిరి పరవాలేదనిపించింది.

 50కథలు విన్నారట..

50కథలు విన్నారట..

వరుసగా ఫెయిల్యూర్స్ రావడంతో నాగార్జున మరో కొత్త తరహా కథతో రావాలని గత ఏడాది నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. మన్మథుడు ప్లాప్ అనంతరం ఇప్పటివరకు నాగ్ 50కి పైగా కొత్త కథలు విన్నాడట. అందులో 45కి పైగా కథలు నచ్చలేదట. అందులో చాలా వరకు సీనియర్ రైటర్స్ చెప్పిన కథలే ఉన్నాయట. కానీ కంటెంట్ బావుంటేనే నాగ్ ఒప్పుకుంటున్నారు.

Recommended Video

Happy Birthday Samantha: Baby Samantha Akkineni Turns 33
అభిమానులకు బ్యాడ్ న్యూస్..

అభిమానులకు బ్యాడ్ న్యూస్..

దాదాపు ఈ ఏడాది నాగ్ బిగ్ స్క్రీన్ పై కనిపించరనే తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే సోగ్గాడే చిన్న నాయనా సీక్వెల్ ని సెట్స్ పైకి తేవాల్సింది. కానీ లాక్ డౌన్ వల్ల కుదరలేదు. ఆగస్ట్ లో స్టార్ట్ చేసి ఇయర్ ఎండింగ్ లో అయినా సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. అది కూడా కుదిరేలా కనిపించడం లేదు. ఇక వచ్చే ఏడాదే నాగ్ దర్శనమిచ్చే ఛాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X