వెన్నెల కిషోర్‌పై నాగార్జున కామెంట్.. అతనెలాంటివాడో చెప్పేశాడు

గతంలో వచ్చిన మ‌న్మ‌థుడు సినిమా ఇన్‌స్పిరేష‌న్‌తో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' సినిమా తెరకెక్కింది. చిత్రంలో కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా కీర్తి సురేష్, సమంత, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 9న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్బంగా చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసింది చిత్రయూనిట్.

ఇందులో భాగంగా తన తోటి నటుడు, కమెడియన్ వెన్నెల కిషోర్ గురించి ప్రత్యేకంగా వీడియో ద్వారా చెప్పాడు నాగార్జున. వెన్నెల కిషోర్‌ని తెగ పొగిడిన నాగ్.. ఆయన మన్మథుడు 2 వెన్నెల లాంటి వాడని కితాబిచ్చాడు. అతను సెట్స్ పై అందరినీ నవ్విస్తూ ఉండేవాడని, ఆయన వేసిన జోకులతో ఎన్నిసార్లు నవ్వుకున్నామో మాకే తెలియదని అన్నాడు నాగార్జున. గతంలో నా మన్మథుడు సినిమా సెట్స్ పై బాగా నవ్వాను.. మళ్ళీ ఇప్పుడు మన్మథుడు 2 అలా నవ్వుతూ షూటింగ్ లో పాల్గొన్నాను అని తెలిపాడు. వెన్నెల కిషోర్ ఎంతో టాలెంట్ ఉన్న యాక్టర్.. అతను నా బ్రదర్.. అతన్ని మిస్ అవుతున్నా అని నాగార్జున పేర్కొన్నాడు.

Akkineni Nagarjunas Comment On Vennela Kishore

మరో మూడు రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. చిత్రంలో నాగార్జున లుక్, రకుల్ పర్‌ఫార్‌మెన్స్ హైలైట్ కానున్నాయి. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా మన్మథుడు 2 సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ పొందింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X