వైల్డ్ డాగ్‌కు ఊహించని దెబ్బ: నాగ్‌ కెరీర్‌లోనే బిగ్ షాక్.. వాళ్లు ఫూల్స్ చేస్తే వీళ్లు నిజంగానే లీక్

చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు కింగ్ అక్కినేని నాగార్జున. ఇలాంటి సమయంలో ఈ సారి పక్కాగా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే గతంలో మాదిరిగానే మరో కొత్త దర్శకుడిని ఎంచుకుని వైవిధ్యమైన కథతో సినిమా చేశాడు. అదే 'వైల్డ్ డాగ్' ఈ మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి మంచి టాక్ కూడా దక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో నాగార్జున సినిమాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మొన్న చిత్ర యూనిట్ అందరినీ ఫూల్స్ చేస్తే.. ఇప్పుడు వాళ్లు లీక్ చేసేశారు. ఆ వివరాలు మీకోసం!

‘వైల్డ్ డాగ్’గా వచ్చిన అక్కినేని నాగార్జున

‘వైల్డ్ డాగ్’గా వచ్చిన అక్కినేని నాగార్జున

నూతన దర్శకుడు సోలోమన్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన చిత్రం 'వైల్డ్ డాగ్'. ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో దియా మీర్జా, సయామీ కేర్, అతుల్ కులకర్ణి, ఆలీ రెజా, బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం సమకూర్చాడు.

కొంటెచూపుతో కవ్విస్తోంది.. తారా సుతారియా హాట్ పిక్స్

నిజ సంఘటనలతో రూపొందిన ‘వైల్డ్ డాగ్’

నిజ సంఘటనలతో రూపొందిన ‘వైల్డ్ డాగ్’

ఇండియాలోని ప్రధాన నగరాల్లో బాంబు పేళ్లుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఆ నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమే 'వైల్డ్ డాగ్'. ఇందులో నాగార్జున ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నటించాడు. బాంబు పేళ్లుళ్ల సూత్రధారుల కోసం జరిగిన ఆపరేషన్‌ను ఈ సినిమాలో చూపించారు. ఈ మూవీ కోసం కొన్ని రియల్ వెపన్స్‌ను కూడా వాడినట్లు చిత్ర యూనిట్ ప్రమోషన్ టైమ్‌లో వెల్లడించింది.

రిలీజ్‌కు ఒకరోజు ముందే లీక్.. ఫూల్స్ చేసి

రిలీజ్‌కు ఒకరోజు ముందే లీక్.. ఫూల్స్ చేసి

అక్కినేని నాగార్జున కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'వైల్డ్ డాగ్' శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలాంటి సమయంలో ఒకరోజు ముందుగానే అంటే గురువారమే ఈ మూవీ లీకైపోయింది. ఈ విషయం చిత్ర నిర్మాణ సంస్థ మ్యాట్నీ మూవీస్ చేసిన ట్వీట్‌తో బహీర్గతం అయిపోయింది. అయితే, ఇది కేవలం జనాల్ని ఫూల్స్ చేయడానికి చేసిన ట్రిక్ అని ఆ తర్వాతే తెలిసింది.

గ్రాండ్‌గా రిలీజైన మూవీ.. పాజిటివ్ రెస్పాన్స్

గ్రాండ్‌గా రిలీజైన మూవీ.. పాజిటివ్ రెస్పాన్స్

'వైల్డ్ డాగ్' మూవీ రిపోర్టులను బట్టి ఈ సినిమా నాగార్జునకు పర్‌ఫెక్ట్ కమ్‌బ్యాక్ అంటున్నారు. మూవీ మొత్తాన్ని వన్ మ్యాన్ షోగా మలచుకున్నారని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ అదుర్స్ అనిపించిందట. అంతేకాదు, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కూడా ఆకట్టుకుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో నాగార్జునకు కీలక సమయంలో హిట్ వచ్చినట్లైంది.

‘వైల్డ్ డాగ్’ మూవీకి ఊహించని ఎదురుదెబ్బ

‘వైల్డ్ డాగ్’ మూవీకి ఊహించని ఎదురుదెబ్బ

చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు అక్కినేని నాగార్జున. ఇలాంటి సమయంలో విడుదలైన అన్ని ప్రాంతాల్లో 'వైల్డ్ డాగ్' మూవీ మంచి స్పందన అందుకుంది. దీంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పైరసీ చేసి ఈ సినిమాను ‌ఆన్‌లైన్‌ లీక్ చేసేశారు. మూవీ రూల్స్ వెబ్‌సైట్‌లో ఈ మూవీ డౌన్‌లోడ్ లింక్ కూడా పెట్టేశారు కొందరు.

వాళ్లు ఫూల్స్ చేస్తే... వీళ్లు లీక్ చేసేశారుగా

వాళ్లు ఫూల్స్ చేస్తే... వీళ్లు లీక్ చేసేశారుగా


ఏప్రిల్ 1వ తేదీన 'వైల్డ్ డాగ్' మూవీ రిలీజ్‌కు ముందే లీక్ అయిందని పేర్కొంటూ చిత్ర యూనిట్ వైవిధ్యమైన ప్రచారం చేసింది. ఇది నిజమేనని నమ్మిన చాలా మంది ఎంతో కంగారు పడిపోయారు. తీరా అది ఏప్రిల్ ఫూల్స్ చేయడానికే అని ఆ తర్వాతే తెలిసింది. అయితే, ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ పైరసీని ప్రోత్సహించే కొన్ని వెబ్‌సైట్లు ఈ సినిమా లింకును వాటిలో అప్‌లోడ్ చేసేశాయి.

నాగార్జున కెరీర్‌లో బిగ్ షాక్.. ఇలా అయితే

నాగార్జున కెరీర్‌లో బిగ్ షాక్.. ఇలా అయితే

ఈ మధ్య కాలంలో నాగార్జునకు భారీ హిట్ మాత్రం దక్కడం లేదు. దీంతో కెరీర్‌లోనే తొలిసారి విజయం పక్కాగా కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో వచ్చిన 'వైల్డ్ డాగ్'కు అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా ఆనంద పడేలోపు పైరసీ లింక్ వల్ల ఆయనకు భారీ షాక్ తగిలినట్లైంది. వీటి వల్ల సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం కూడా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X