18 నెలల కాపురం.. ప్రెగ్నెన్సీ కూడా.. లాక్‌డౌన్‌లో ఆ కారణంగా డిప్రెషన్: నాగార్జున షాకింగ్ కామెంట్స్

ఏజ్ బార్ అవుతోన్నా.. కుర్రాళ్లకు పోటీగా తయారవుతూ.. ఆరు పదుల వయసులోనూ అదిరిపోయే ఫిజిక్.. లుక్స్‌తో మాయ చేస్తున్నాడు కింగ్ అక్కినేని నాగార్జున. ఏఎన్నార్ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించి దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తోన్నాడాయన. ఈ క్రమంలోనే జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం నాగార్జున 'వైల్డ్ డాగ్' అనే సినిమాతో రెడీగా ఉన్నాడు. ఈ మూవీ ప్రెస్‌మీట్‌లో ఆయన షాకింగ్ కామెంట్స్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే...

డిజాస్టర్‌ సినిమాతో అందరిలోనూ నిరాశ

డిజాస్టర్‌ సినిమాతో అందరిలోనూ నిరాశ

కొన్నేళ్లుగా అక్కినేని నాగార్జున భారీ హిట్‌ను అందుకోలేకపోతున్నాడు. ఆయన చివరిగా రెండేళ్ల క్రితం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' అనే సినిమా చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా చేసిన ఈ మూవీ ఎన్నో అంచనాలతో విడుదలైంది. కానీ, డిజాస్టర్‌గా మిగిలింది. ఈ సినిమా ఫలితంతో ప్రేక్షకులతో పాటు అక్కినేని అభిమానులను సైతం నిరాశకు లోనయ్యారు.

అలా మైమరపించిన అక్కినేని నాగార్జున

అలా మైమరపించిన అక్కినేని నాగార్జున

లాక్‌డౌన్‌లో సినిమాలు ఆగిపోవడంతో వెండితెర ప్రేక్షకుల ముందుకు రాలేకపోయాడు కింగ్ నాగార్జున. కానీ, గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ నాలుగో సీజన్ ద్వారా మాత్రం బుల్లితెర ఆడియెన్స్‌ను పలకరించాడు. మరీ ముఖ్యంగా ఈ సీజన్‌లో ఆయన అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. అంతేకాదు, ఎన్నో రికార్డులను క్రియేట్ చేసి చరిత్రను సృష్టించాడు.

వైల్డ్ డాగ్‌ అంటూ వస్తోన్న అక్కినేని హీరో

వైల్డ్ డాగ్‌ అంటూ వస్తోన్న అక్కినేని హీరో

అక్కినేని నాగార్జున.. నూతన దర్శకుడు సోలోమన్ తెరకెక్కించిన 'వైల్డ్ డాగ్'లో నటించాడు. ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో దియా మీర్జా, సయామీ కేర్, అతుల్ కులకర్ణి, ఆలీ రెజా, బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం సమకూర్చాడు.

ఓటీటీ నుంచి థియేటర్లలోకి వచ్చేస్తుంది

ఓటీటీ నుంచి థియేటర్లలోకి వచ్చేస్తుంది

నాగార్జున కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'వైల్డ్ డాగ్'ను మొదట థియేటర్లలోనే విడుదల చేయాలని భావించారు. కానీ, లాక్‌డౌన్ సమయంలో ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు రిలీజ్ హక్కులు అమ్ముకున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో అగ్రిమెంట్‌ను క్యాన్సిల్ చేసుకున్న యూనిట్.. ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.

18 నెలల కాపురం.. ప్రెగ్నెన్సీ కూడా అంటూ

18 నెలల కాపురం.. ప్రెగ్నెన్సీ కూడా అంటూ

సోమవారం 'వైల్డ్ డాగ్' ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున ఎన్నో విషయాలు వెల్లడించారు. 'వైల్డ్ డాగ్‌తో మాది 18 నెలల కాపురం. ప్రెగ్నెన్సీ కూడా. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని మేమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. హైదరాబాద్ ప్రజలకు సంబంధించిన కథ. మిమ్మల్ని కచ్చితంగా అలరిస్తుంది. అందుకే థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నాం' అన్నారు.

లాక్‌డౌన్‌లో ఆ కారణంగా డిప్రెషన్‌లోకి

లాక్‌డౌన్‌లో ఆ కారణంగా డిప్రెషన్‌లోకి

ఈ ప్రెస్‌మీట్‌లో అక్కినేని నాగార్జున పర్సనల్ విషయాలు గురించి మాట్లాడుతూ.. 'నా కెరీర్‌లో 37 ఏళ్లుగా షూటింగ్‌లతో బిజీగా ఉంటున్నాను. కానీ, ఎప్పుడూ లేని విధంగా లాక్‌డౌన్‌ వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉండే సమయం దొరికింది. అయితే, షూటింగ్‌లు లేకపోవడంతో డిప్రెషన్‌‌గా అనిపించింది. నా జీవితం నుంచి 2020 తీసేశాను' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారాయన.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X