అక్కినేని ఫ్యామిలీలో తీవ్ర విషాదం.. పుట్టెడు దు:ఖంలో నాగార్జున.. సినీ ప్రముఖులు, అభిమానుల పరామర్శ!
అక్కినేని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అక్కినేని నాగేశ్వరరావు కుమార్తె, నాగార్జున సోదరి నాగ సరోజ కన్నుమూశారు. సినిమా ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం లేని నాగ సరోజ.. ఏదో పని మీద ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ అనారోగ్య కారణాల చేత ఆమె కన్నుమూశారు. దీంతో అక్కినేని ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ వార్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే....
అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అక్కినేని నాగేశ్వరరావుకు ముగ్గురు కుమార్తెలు, ఒక ఇద్దరు కుమారులు. అందులో నాగ సుశీల, నాగ సత్యవతి, నాగ సరోజ కుమార్తెలు కాగా...వెంకట్, నాగార్జున కుమారులు. అయితే నాగ సత్యవతి గతంలోనే చనిపోయారు. ఇక ఇప్పుడు తాజాగా నాగ సరోజ చనిపోయారు. దీంతో అక్కినేని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పుట్టేడు దుఃఖంలో నాగార్జున కుటుంబం మునిగిపోయింది.

స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు కూతురు, నాగార్జున సోదరి నాగ సరోజ... అక్టోబర్ 17న రాత్రే కన్నుమూశారు. కానీ ఈ వార్త ఆలస్యంగా బయటకు వచ్చింది. నాగ సుశీల పేరు అందరికీ తెలుసు.. ఆమె సుశాంత్ తల్లిగా నాగ సుశీలకు గుర్తింపు ఉంది. కానీ నాగ సరోజ పేరు ఎక్కడ వినలేదు. ఎందుకంటే ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇక ఆమెకు సంబంధించిన వార్తలు ఎక్కడ రాలేదు.
ఇక నాగ సరోజ ఏదో పనిమీద ముంబైయి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ పని చూసుకున్న ఆమె అనారోగ్యం పాలై మంగళవారం రాత్రి చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నాగార్జున తీవ్ర విషాదంలో మునిగిపోయారు. షూటింగ్స్ అన్నింటికి బ్రేక్ ఇచ్చి... సోదరి మృతి తెలుసుకున్న నాగార్జున హుటా హుటిన బయలుదేరారు. ఇక అక్కడి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు... నాగార్జునను పరామర్శిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు సైతం ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులు.. నాగార్జున ఇంటికి వెళ్తున్నారని తెలుస్తోంది.
ఇక నాగార్జున బిగ్ బాస్ షోకి హోస్టుగా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ వారం బిగ్ బాస్ హౌస్టుగా వ్యవహారిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. సోదరి మృతితో దుఃఖంలో ఉన్న నాగార్జున.. ఈ వారం హోస్టుగా ఉండకపోవచ్చు అని అంటున్నారు. మరి చూడాలి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











