దేవుడులా వచ్చాడు... నాన్నను గొప్పగా సాగనంపాడు: నాగార్జున

By Bojja Kumar

అఖిల్‌ హీరోగా, కళ్యాణి ప్రియదర్శిన్‌ హీరోయిన్‌గా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాగార్జున నిర్మాతగా తెరకెక్కిన చిత్రం 'హలో'. అన్నపూర్ణ స్టూడియోస్‌ అండ్‌ మనం ఎంటర్‌ప్రైజెస్‌ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్‌ 22న విడుదలకు సిద్ధమైంది. అనూప్‌ సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం వైజాగ్‌లో జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున ప్రసంగం ఆసక్తికరంగా సాగింది.

Recommended Video

అఖిల్ ఎమోషనల్ స్పీచ్...!
 కొడుతున్నాం అని చెప్పాను... కొట్టాం

కొడుతున్నాం అని చెప్పాను... కొట్టాం

'అఖిల్‌తో దగ్గరుండి సినిమా చేస్తానని మాటిచ్చాను. అన్న మాట ప్రకారమే ‘హలో' సినిమా చేశాను అని నాగార్జున అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. అఖిల్‌ సినిమా కంటే ముందుగా చైతన్యతో 'రారండోయ్‌ వేడుక చూద్దాం' అనే సినిమా చేశాను. ఆ ఆడియో వేడుకలో `వస్తున్నాం..కొడుతున్నాం..`అని చెప్పాను. అన్నట్టే హిట్ కొట్టాం. ఆ తర్వాత అఖిల్ సినిమా మొదలు పెట్టినట్లు నాగార్జున తెలిపారు.

 దేవుడులా వచ్చాడు... నాన్నను గొప్పగా సాగనంపాడు

దేవుడులా వచ్చాడు... నాన్నను గొప్పగా సాగనంపాడు

‘నాకు ఎంతో ఇష్టమైన డైరెక్టర్ విక్రమ్. ఆయనంటే కేవలం ఇష్టం కాదు... సెంటిమెంట్. మనసుకు దగ్గరైన డైరెక్టర్. ఎంతో కెరీర్, ఎన్నో విజయాలు చూసిన తెలుగు ప్రేక్షకుల్లో ఒక లెజెండ్ గా నిలిచిపోయిన మా నాన్నగారి ఆఖరి సినిమా ఎలా తీయాలి? అని ఆలోచిస్తున్న సమయంలో విక్రమ్ కుమార్ నాకు దేవుడులా వచ్చాడు. మనం లాంటి సినిమా చేసి నాన్నగారిని ఎంతో గొప్పగా సాగనంపాడు. థాంక్యూ విక్రమ్' అని నాగార్జున వ్యాఖ్యానించారు.

 అఖిల్ కు ఇది రీ లాంచ్

అఖిల్ కు ఇది రీ లాంచ్

అఖిల్‌ని ఈ సినిమాతో రీలాంచ్‌ చేస్తున్నాను. అఖిల్‌ను ఎలా చూడాలనుకున్నాను అనే విషయాన్ని విక్రమ్‌తో చెబితే తను `హలో` సినిమాను తయారు చేశాడు. అక్కినేని అభిమానులు అఖిల్‌ను ఎలా చూడాలనుకుంటారో అలాగే ఈ సినిమాలో చూస్తారు.... అని నాగార్జున తెలిపారు.

 ఇండస్ట్రీకి డాన్స్ నేర్పింది ఏఎన్ఆర్ గారు, అఖిల్ అచ్చు గుద్దినట్లే

ఇండస్ట్రీకి డాన్స్ నేర్పింది ఏఎన్ఆర్ గారు, అఖిల్ అచ్చు గుద్దినట్లే

తెలుగు సినిమా ఇండస్ట్రీకి డ్యాన్స్‌, గ్రేస్‌ నేర్పింది ఏఎన్ఆర్ గారు. ఆయన అచ్చుగుద్దినట్లు అఖిల్‌లో కనపడతున్నాడు... అని నాగార్జున తెలిపారు.

 అఖిల్ ను పెద్ద స్టార్ చేయాలని కష్టపడ్డారు

అఖిల్ ను పెద్ద స్టార్ చేయాలని కష్టపడ్డారు

‘హలో' సినిమా కోసం అన్నపూర్ణ టీం అన్నీ చక్కగా చేశారు. అఖిల్‌ను పెద్ద హీరోను చేయాలని.. ఎంతో ప్రేమతో పని చేశారు. అందరికీ పేరు పేరునా థాంక్స్ చెబుతున్నాను.... అని నాగార్జున వ్యాఖ్యానించారు.

 నన్ను, అమలను కలిపారు

నన్ను, అమలను కలిపారు

చాలా రోజుల క్రితం 'హలో గురు ప్రేమ కోసమేరా జీవితం..' అని ప్రియన్‌గారు నన్ను, అమలను కలిపారు. డెస్టినీ అంటారో ఏమో కానీ, ఇప్పుడు ప్రియదర్శన్‌ అమ్మాయి క‌ల్యాణి ..అఖిల్‌తో సినిమా చేస్తుంది. ఈ చిత్రంలో కల్యాణి అద్భుతంగా నటించింది. తనకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది.... అని నాగార్జున తెలిపారు.

 పెద్ద తుఫాన్, ఆడియో ఫంక్షన్ చేయవద్దన్నారు

పెద్ద తుఫాన్, ఆడియో ఫంక్షన్ చేయవద్దన్నారు

ఈ వేడుక‌కు ముందు వైజాగ్‌లో తుఫాన్‌ ఉందన్నారు. ఇక్కడ ఆడియో ఫంక్షన్ చేయవద్దన్నారు. కానీ అన్నపూర్ణ టీం సభ్యులు 'మీరు వైజాగ్‌ వెళ్లండి సార్‌..పైన నాన్నగారున్నారు. ఆయన చూసుకుంటారు' అన్నారు. అదే భరోసాతో ఇక్కడికి వచ్చాను. మ్యాజిక్‌ జరిగింది.... అని నాగార్జున తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X