అన్నా అని పిలిచేది ఆయన ఒక్కడినే, చెప్పలేని భాద.. ఎమోషనల్ అయిన నాగ్!
Recommended Video

యువ సామ్రాట్ నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం సెప్టెంబర్ 13న వినాయచవితి కానుకగా విడుదల కాబోతోంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ చిత్రంలో అత్తగా కీలక పాత్రలో నటించింది. ప్రముఖ దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆదివారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని అతిథులుగా హాజరయ్యారు. అన్నయ్య ఈవెంట్ కు అఖిల్ కూడా హాజరు కావడం విశేషం. నాగార్జున ఈ ఈవెంట్ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.

శైలజారెడ్డి అల్లుడు కాదు
నాగార్జున మాట్లాడుతూ.. నాగ చైతన్య శైలజారెడ్డి అల్లుడు అని అంటున్నారు. కాదు. అక్కినేని నాగేశ్వరరావు మనవడు. నాగార్జున పెద్ద కొడుకు అని చెప్పి ఆడియన్స్ చేత కేకలు పెట్టించారు.

చిలిపితనం
అందరూ చైతన్యని చాలా సాఫ్ట్ అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చైతన్యలో చిలిపితనం కూడా ఉంది. ఆ చిలిపితనాన్ని మారుతి బాగా వాడుకున్నారు. తాను కొంతభాగం సినిమా చూశానని నాగార్జున తెలిపాడు. తన చిత్రం అల్లరి అల్లుడు అంత పెద్ద హిట్ అవుతుందని నాగ్ తెలిపాడు.

రమ్య అంటే
బాహుబలి తరువాత రమ్య అంటే తెలియని వారు ఇండియాలోనే లేరు అని నాగార్జున రమ్యకృష్ణని ఉద్దేశించి మాట్లాడారు. మా ఇద్దరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. రమ్య నడుస్తున్నా, నవ్వుతున్నా కళ్లప్పగించి చూడాల్సిందే అని నాగ్ ప్రశంసించారు.

ఆయన ఒక్కడినే
గత నెల ఎందుకో బాగాలేదు అని నాగ్ అన్నారు. నాకు బాగా కావలసిన వాళ్ళు ఇద్దరు దూరమయ్యారు. నేను అన్నా అని పిలిచేది హరికృష్ణ ఒక్కరినే. ఆయన దూరమయ్యారు అంటూ నాగ్ వేదికపై ఎమోషనల్ అయ్యారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. నాగ్, హరికృష్ణ కలసి సీతారామరాజు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

అక్కినేని అభిమాని
అక్కినేని అభిమాన సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి కూడా మరణించిన సంగతి తెలిసిందే. ఆయన్ని నాగ్ గుర్తుచేసుకున్నారు. నాన్న గారి దగ్గరనుంచి రవీందర్ రెడ్డి మా ఫ్యామిలీకి అభిమానిగా ఉన్నారు. నేను సినిమాల్లోకి వస్తున్నాను అంటే మొదట కంగ్రాట్స్ చెప్పింది ఆయనే అని నాగ్ గుర్తు చేసుకున్నారు. ఆయన మరణించడంతో ఇటీవలే వారి ఫ్యామిలీని కూడా కలిశానని నాగ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











