»   » 'బాహుబలి' గురించి నాగార్జున స్పందన ఇలా...

'బాహుబలి' గురించి నాగార్జున స్పందన ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :భారీ అంచనాల మధ్య విడుదలైన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం విడుదలైన నాటి నుంచి వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో 4000 థియేటర్లలో శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం గురించి అన్ని వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం చూసిన నాగార్జున తన అనుభూతిని ఈ క్రింద విధంగా వ్యక్తం చేసారు.

Spectacular visuals and dreams come alive in BAAHUBALI !!we salute you rajamouli. - Akkineni Nagarjuna


Posted by Akkineni Nagarjuna on 11 July 2015

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి తొలిరోజు 50కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఉభయ తెలుగు రాష్రాల్లో కలిపి మొదటి రోజు 21కోట్ల 63లక్షల షేర్‌ను సాధించి బాహుబలి సరికొత్త రికార్డును నెలకొల్పింది.


బాలీవుడ్‌లో డబ్బింగ్ చిత్రంగా విడుదలై ఫస్ట్‌డే 5 కోట్లపైగా కలెక్షన్లు సాధించడం రేర్‌ఫీట్‌గా చెబుతున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఈ కలెక్షన్ల జోరు ఇలాగే కొనసాగితే బాహుబలి మరిన్ని రికార్డుల మోత మోగించడం ఖాయమని చెబుతున్నారు ట్రేడ్ పండితులు.


మరో ప్రక్క


Akkineni Nagarjuna talk about Baahubali

‘బాహుబలి' చిత్రం అమెరికా బాక్సాఫీసు వద్ద కూడా తన సత్తా చాటుతోంది. యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘బాహుబలి' సరికొత్త రికార్డు సృష్టించింది. తెలుగు సినిమా సత్తా చాటింది.


ఇప్పటి వరకు అమెరికాలో విడుదలైన భారతీయ సినిమాల్లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో అమీర్ ఖాన్ నటించిన ‘పికె' చిత్రం టాప్ పొజిషన్లో ఉంది. ‘పికె' చిత్రం అక్కడ తొలి రోజు 0.97 మిలియన్ డాలర్లు(రూ. 6.15 కోట్లు) వసూలు చేసింది. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి' పికె రికార్డును బద్దలు కొట్టింది.


‘బాహుబలి' సినిమా అమెరికా బాక్సాపీసు వద్ద తొలి రోజు ఏకంగా 1.30 మిలియన్ డాలర్లు(రూ. 8.24 కోట్లు) వసూలే చేసింది. ఈ సినిమా తొలి రోజే ఇంత భారీ మొత్తం వసూలు చేసిందంటే మున్ముందు ఈ చిత్రం ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 24 కోట్ల షేర్ సాధించింది. ఇదీ కాక తెలుగు ఓవర్సీస్ మార్కెట్, తమిళ వెర్షన్, హిందీ వెర్షన్ అన్నీ కలుపుకుంటే ఎంత వసూలు చేస్తుందో ఊహకు అందని విధంగా ఉంది. తెలుగులో ఈ చిత్రం తొలి వారం పూర్తయ్యేనాటికి వసూళ్లు 100 కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఫస్ట్ వీకెండ్ (శుక్ర, శని, ఆది) పూర్తయ్యే నాటికి రూ. 70 కోట్ల పైన వసూలు చేస్తుందని అంచనా.


రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో రెండు భాగాలు ఈ చిత్రాన్ని రూ. 250 కోట్ల ఖర్చుతో తెరకెక్కించారు. ప్రస్తుతం విడుదలైంది తొలి భాగమైన ‘బాహుబలి-ది బిగినింగ్'. రెండో భాగం 2016లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
Akkineni Nagarjuna talk about Baahubali : " Spectacular visuals and dreams come alive in BAAHUBALI !!we salute you rajamouli"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu