దేవదాస్ కోసం ఎడిటర్ గా మారిన నాగ్ !
Recommended Video

దేవదాస్ 27న విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇంకో పదిహేను రోజులు మాత్రమే టైం ఉండటంతో బాలన్స్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా వుంది చిత్ర యూనిట్. చైతు అఖిల్ ఇలా ఎవరి సినిమా అయినా అన్ని దగ్గరుండి చూసుకునే నాగ్ దేవదాస్ విషయంలోనూ అంతే శ్రద్ధ తీసుకుంటున్నట్టు టాక్. దర్శకడు శ్రీరామ్ ఆదిత్యకు కేవలం రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉంది. అందులోనూ పెద్ద హీరోలను డీల్ చేయలేదు కాబట్టి.. ఎక్కడైనా తడబడ్డాడేమో అని నాగ్ దగ్గరుండి మరీ చూసుకునే పరిస్థితి కనిపిస్తోందని వినికిడి. అదే నిజమైతే ఆ మాత్రం జాగ్రత్త తీసుకోవడం అవసరమే కానీ ప్రమేయం ఎక్కువైతే సమస్యలు రావొచ్చు.
నిజానికి శైలజారెడ్డి అల్లుడు వ్యవహారంలో కూడా నాగ్ ఇలాగె అన్ని దగ్గరుండి చుసుకున్నారట. అయితే చైతుకు ఇలాంటి జానర్ మొదటిసారి కావడంతో నాగ్ టీమ్ దగ్గరుండి చక్కదిద్దినట్టు తెలిసింది. అందుకే దేవదాస్ ను సైతం ఇలాగే కాస్త ఎడిటింగ్ ప్లస్ రిపేర్లు చేసే అవకాశం ఉందంటున్నారు.
నిజానికి నాగ్ జడ్జ్ మెంట్ లు ఈ మధ్య అంతగా సక్సస్ ఇవ్వడం లేదు. తనే స్వంతంగా నిర్మించి అఖిల్ కు రీ లాంచింగ్ రేంజ్ లో పదే పదే చెప్పుకున్న హలో రిజల్ట్ ఏమైందో తెలిసిందేగా. అందుకే దేవదాస్ విషయంలో అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్త పడినట్టు సమాచారం. అదీ తన తండ్రి ఎవర్ గ్రీన్ టైటిల్ తో వస్తున్న మూవీ కావడం తో పేరు చెడగొట్టకుండా నాగ్ ఈ మాత్రం కేర్ తీసుకోవడం కుడా ఒకందుకు మంచిదే.



Click it and Unblock the Notifications











