జీవితాన్ని మార్చిన సినిమా, ఇప్పుడు మరోసారి: నాగార్జున ఉద్వేగ భరితంగా

నాగార్జున-రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.

Recommended Video

నా జీవితాన్ని మార్చిన సినిమా అది !

నాగార్జున-రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల 'రాజుగారి గది 2' మూవీ ప్రమోషన్స్‌లో త్వరలో ఆర్జీవీతో మూవీ చేస్తున్నట్లు ప్రకటించిన నాగార్జున ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. నవంబర్ 20 అంటే ఈరోజు నుండి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు వర్మ ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశాడు.

రామ్ గోపాల్ వర్మ కూడా

రామ్ గోపాల్ వర్మ కూడా

ఇక శివ తర్వాత రామ్ గోపాల్ వర్మ కూడా ఎన్నో సినిమాలు చేస్తూ.. తనదైన కమెంట్స్ తో సోషల్ మీడియాలో సంచలన దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. వర్మ తీసిన రక్తచరిత్ర, వంగవీటి లాంటి బయోపిక్స్ తో తెలుగు సినిమా కొత్త పంథాలోకి వెళ్లింది. తాజాగా వర్మ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కూడా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

 కింగ్ నాగార్జున

కింగ్ నాగార్జున

మరోవైపు కింగ్ నాగార్జునకు కూడా.. వర్మ ఓ ఆసక్తికరమైన కథ వినిపించాడట. దానికి తాను కూడా చాలా ఎగ్జయిటయ్యానని స్వయంగా నాగార్జున తెలిపారు. అయితే మరొకసారి అదే తీవ్రతతో స్టోరీ చెప్పాలని.. సమంత,నాగచైతన్యల వివాహం తర్వాత మళ్లీ కలుద్దామని వర్మతో చెప్పానని నాగార్జున తెలిపారు.

25ఏళ్ల తర్వాత

25ఏళ్ల తర్వాత

ఈనేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ కూడా ఇదే విషయాన్ని కన్ఫమ్ చేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. 25ఏళ్ల తర్వాత నాగార్జునతో మళ్లీ సినిమా చేయబోతున్నానని, శివ లానే దీన్ని కూడా సక్సెస్ ఫుల్ చిత్రంగా తెరకెక్కిస్తాననే నమ్మకంతో వున్నానని వర్మ తెలిపారు. ఇక ఈ ఇద్దరూ చెప్పేసరికి జనాలలో కూడా ఇంట్రస్ట్ బాగా పెరిగిపోయింది... ఆ కాంబినేషన్ అలాంటిది మరి...

 సోషల్ మీడియాలో ట్వీట్

సోషల్ మీడియాలో ట్వీట్

మరికొన్ని నిమిషాల్లో సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. నాగార్జున తాజాగా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. వర్మతో చేయబోయే సినిమా తనకు శివ మూవీలాగే గుర్తింపు ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తన ఫీలింగ్‌ని మాటల్లో వివరించలేనన్నారు.

 మాటల్లో వివరించలేను

మాటల్లో వివరించలేను

"28సంవత్సరాల క్రితం శివ సినిమా నా లైఫ్‌ని మార్చేసింది. ఇప్పుడు మరో సినిమా ప్రస్తుతం ఆ సినిమా గురించి నేనెలా ఫీలవుతున్నానో మాటల్లో వివరించలేను. కానీ ఆ లైఫ్ ప్రతి రోజు చాలా ఎగ్సైటింగ్‌గా మాత్రం ఉంటుందని ఆశిస్తున్నా." అని నాగార్జున ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X