Don't Miss!
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నేటితో 29 సంవత్సరాలైంది..... నాగార్జున ఆసక్తికరమైన ట్వీట్!
నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో వచ్చిన 'శివ' చిత్రం అప్పట్లో ట్రెండ్ సెట్టర్ మూవీ. నాగార్జున కెరీర్లోనే ఒక సంచలనం. ఆ తర్వాత నాగ్-ఆర్జీవి కాంబినేషన్లో కొన్ని సినిమాలు వచ్చినా 'శివ' స్థాయిలో విజయం సాధించలేదు. దాదాపు 25 ఏళ్ల గ్యాప్ తర్వాత నాగ్-ఆర్జీవి కలిసి సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముంబైలో జరుగుతోంది.
|
29 సంవత్సరాలైంది అంటూ నాగార్జున ట్వీట్
ప్రస్తుతం ఆర్జీవితో సినిమా చేస్తున్న నాగార్జున ఓ ఆసక్తికర విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ‘ఫిబ్రవరి 16, 1989... 29 సంవత్సరాల క్రితం గేమ్ చేంజర్ కల్ట్ ఫిల్మ్ ‘శివ' ఆర్జీవితో కలిసి మొదలు పెట్టాను.... అంటూ గుర్తు చేసుకున్నారు.
|
రామ్ గోపాల్ వర్మ ట్వీట్
పాతికేళ్ల తర్వాత మళ్లీ ఇదే రోజున తనకు ఓ కొత్త యాక్టర్ దొరికాడు, అతడి పేరు నాగార్జున... ఇప్పటి వరకు మీరు చూడని రియలిస్టిక్ యాక్షన్ సీన్లు నా చిత్రంలో చేయబోతున్నాడు అంటూ... వర్మ ట్వీట్ చేశారు.
|
మై బ్రాండ్ న్యూ హీరో
29 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున నా తొలి చిత్రం శివ ప్రారంభం అయింది. ఈ సంర్భంగా నా బ్రాండ్ న్యూ హీరో ఫోటోలు మీ కోసం అంటూ వర్మ తాజా చిత్రానికి సంబంధించిన... నాగార్జున ఫోటోలు షేర్ చేశారు.
శివ స్థాయిలో ఉండే సినిమా
25 ఏళ్ల తర్వాత మళ్లీ నాగార్జున, ఆర్జీవి చేతులు కలపడంతో వీరిద్దరి కాంబినేషన్లో ‘శివ' స్థాయి సినిమా వస్తుందని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రామ్ గోపాల్ వర్మ సినిమా తెరకెక్కిస్తున్నారు.
అందుకే టైటిల్ ఆలస్యం
రామ్ గోపాల్ వర్మ సినిమా టైటిల్స్ చాలా భిన్నంగా ఉంటాయి. మరి నాగార్జునతో సినిమా అంటే టైటిల్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సినిమా టైటిల్ ప్రత్యేకంగా ఉండటం కోసం అన్వేషిస్తున్నారు.