బిగ్‌బాస్‌‌పై నాగార్జున సంచలన ట్వీట్.. ప్రచారాలు నమ్మకండి అంటూ అంతా చెప్పేశాడు

బుల్లితెర పాపులారిటీ షో బిగ్ బాస్ తుది అంకానికి చేరుకుంది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 3 పేరుతో జులై 21వ తేదీన మొదలైన ఈ షో నవంబర్ 3తో ముగియనుంది. 100 రోజులు 100 కెమెరాలు అంటూ నాగార్జున పలకరింపుకు ముగింపు ముహూర్తం కుదిరింది. నవంబర్ 3వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ షో గ్రాండ్ ఫినాలే జరగనుంది.

పెద్ద ఎత్తున పుకార్లు.. నాగార్జున ఎంటర్

పెద్ద ఎత్తున పుకార్లు.. నాగార్జున ఎంటర్

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ విజేత ఎవరనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు షికారు చేస్తున్నాయి. కొందరు పక్కా శ్రీముఖి విన్నర్ అని చెప్తుంటే.. ఇంకొందరు రాహుల్ విజేత అని బల్లగుద్ది చెబుతున్నారు. దీంతో ఈ ఇష్యూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ఎన్నో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇది చూసి తాజాగా నాగార్జున స్పందించారు.

బిగ్ బాస్ హౌస్‌లో ఐదుగురు.. అసలు మ్యాటర్ లీక్

బిగ్ బాస్ హౌస్‌లో ఐదుగురు.. అసలు మ్యాటర్ లీక్

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఐదుగురు కంటిస్టెంట్స్ ఉన్నారు. శ్రీముఖి, వరుణ్ సందేశ్, అలీ, రాహుల్, బాబా భాస్కర్‌ లు ఫైనల్ రేస్‌లో బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. అయితే సోషల్ మీడియా సందేశాలు, ఓటింగ్ ప్రకారం ఇప్పటికే విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? ఎలిమినేట్ అయ్యేది ఎవరు? అనే దానిపై ఓ క్లారిటీకి వచ్చారు జనం. ఫైనల్‌గా మెజారిటీ ఓట్లతో శ్రీముఖిపై రాహుల్ గెలిచారనే టాక్ ముదిరింది.

నాగార్జున ట్వీట్.. అంతా చెప్పేస్తూ!

ఇదంతా చుసిన బిగ్‌బాస్‌ హోస్ట్‌ నాగార్జున ఓ ట్వీట్ చేశారు. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 ఒక అద్భుతమైన ప్రయాణమని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. బిగ్‌బాస్‌ విన్నర్‌పై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని, విజేత ఎవరనేది సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమంలో లైవ్ చూసి తెలుసుకోవాలని అన్నారు నాగార్జున.

అట్టహాసంగా ఫైనల్ ఎపిసోడ్.. హీరోయిన్ల అందాలు

అట్టహాసంగా ఫైనల్ ఎపిసోడ్.. హీరోయిన్ల అందాలు

ఇక ఇన్నాళ్లు ఎంతో ఆసక్తికరంగా సాగిన బిగ్ బాస్ సీజన్ 3 ముగింపు వేడుకలను ఎంతో అట్టహాసంగా ప్లాన్ చేశారు మేకర్స్. బిగ్ బాస్ కంటిస్టెంట్లు, తెలుగు హీరోయిన్ల అందాలు ఈ షోకి స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలా అన్నీ సిద్ధం చేసింది బిగ్ బాస్ మేనేజ్‌మెంట్. దీతో బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ కోసం ఆతృగా ఉన్నారు జనం.

చిరు, నాగ్ సందడి

చిరు, నాగ్ సందడి

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చారని టాక్. అదేవిధంగా హీరోయిన్లు నిధి అగర్వాల్, క్యాథరిన్, అంజలి, రాశి ఖన్నా సహా పలువురు అందగత్తెలు బిగ్ బాస్ వేదికపై చిందులేస్తూ హంగామా చేయనున్నారట. వేదికపై చిరంజీవి, నాగార్జున సందడి కనువిందు చేయనుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X