టాలీవుడ్‌లో పెను సంచలనం: రిలీజ్‌కు ముందే లీకైన ‘వైల్డ్ డాగ్’.. ఆ సైట్‌లో ఫుల్ మూవీ డౌన్‌లోడ్ లింక్
పేరుకు సీనియర్ హీరోనే అయినా.. అందంలో, ఫిట్‌నెస్‌లో కుర్రాళ్లకు ధీటుగా కనిపిస్తుంటాడు కింగ్ అక్కినేని నాగార్జున. కెరీర్ ఆరంభం నుంచే తనదైన శైలి సినిమాలతో సత్తా చాటుతోన్న ఆయన.. జయాపజయాలను ఏమాత్రం బేరీజు వేయడం లేదు. ఫలితంగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో వరుసగా పరాజయాలను ఎదుర్కొంటోన్న ఈ అక్కినేని హీరో.. ఇప్పుడు 'వైల్డ్ డాగ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో విడుదలకు ఒకరోజు ముందే ఈ సినిమా లీకైపోయింది. దీనిపై నిర్మాణ సంస్థ స్పందించింది. ఆ వివరాలు మీకోసం!

వైల్డ్ డాగ్ అంటూ వస్తోన్న అక్కినేని హీరో
అక్కినేని నాగార్జున.. నూతన దర్శకుడు సోలోమన్ తెరకెక్కించిన 'వైల్డ్ డాగ్'లో నటించాడు. ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో దియా మీర్జా, సయామీ కేర్, అతుల్ కులకర్ణి, ఆలీ రెజా, బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం సమకూర్చాడు.

నిజమైన సంఘటనలతో తెరకెక్కిన చిత్రం
హైదరాబాద్‌లోని గోకుల్ చాట్ వద్ద బాంబు పేళ్లుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఆ నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమే 'వైల్డ్ డాగ్'. ఇందులో నాగార్జున ఎన్నైఏ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. బాంబు పేళ్లుళ్ల సూత్రధారుల కోసం జరిగిన ఆపరేషన్‌ను ఈ సినిమాలో చూపించారు. ఈ మూవీ కోసం కొన్ని రియల్ వెపన్స్‌ను కూడా వాడినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఒక్క దానితోనే అంచనాలు పెంచేశారుగా
రెండేళ్ల క్రితం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' అనే సినిమా చేశారు. ఈ మూవీ ఎన్నో అంచనాలతో విడుదలైంది. కానీ, డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో 'వైల్డ్ డాగ్' మీద అక్కినేని హీరోతో పాటు అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో వచ్చిన మూవీ ట్రైలర్ అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. దీంతో మార్కెట్ కూడా భారీగా జరిగింది.

ఓటీటీ నుంచి థియేటర్లలోకి వచ్చేస్తుంది
నాగార్జున కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'వైల్డ్ డాగ్'ను మొదట థియేటర్లలోనే విడుదల చేయాలని భావించారు. కానీ, లాక్‌డౌన్ సమయంలో ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు రిలీజ్ హక్కులు అమ్ముకున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో అగ్రిమెంట్‌ను క్యాన్సిల్ చేసుకున్న యూనిట్.. ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.

రిలీజ్‌కు ముందే లీకైన ‘వైల్డ్ డాగ్' మూవీ
అక్కినేని నాగార్జున కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'వైల్డ్ డాగ్' శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో విడుదలకు అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఒకరోజు ముందుగానే అంటే గురువారమే ఈ మూవీ లీకైపోయింది. ఈ విషయం 'వైల్డ్ డాగ్' చిత్ర నిర్మాణ సంస్థ మ్యాట్నీ మూవీస్ చేసిన ట్వీట్‌తో బహీర్గతం అయిపోయింది.

ఆ సైట్‌లో ఫుల్ మూవీ డౌన్‌లోడ్ లింక్
పైరసీని ప్రోత్సహించే సైట్లలో ఒకటైన మూవీ రూల్జ్‌లో 'వైల్డ్ డాగ్' ఫుల్ మూవీ దర్శనమిచ్చింది. దీంతో అక్కినేని అభిమానుల్లో ఒకరు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో మ్యాట్నీ మూవీస్ దీనిని రీట్వీట్ చేస్తూ.. తమ మూవీ అధికారిక ఈమెయిల్‌కు రిపోర్ట్ చేయమని సదరు నెటిజన్‌కు చెప్పింది.

టాలీవుడ్‌లో సంచలనం.. విభిన్న కామెంట్లు
'వైల్డ్ డాగ్' మూవీ ఫుల్ మూవీ లీక్ అయినట్లు వచ్చిన వార్త టాలీవుడ్‌లో పెను సంచలనం అవుతోంది. ఇలాంటి చాలా మంది సదరు వెబ్‌సైట్‌ను చూసి అందులో ఆ సినిమా లింక్ లేదని చెబుతున్నారు. ఇది ఏప్రిల్ ఫూల్స్ చేయడానికి ప్లే చేసిన ట్రిక్ అని కొందరు అంటుంటే.. సినిమా ప్రమోషన్‌లో భాగంగా చేసిందని మరికొందరు కామెంట్లు చేస్తుండడం విశేషం.


Click it and Unblock the Notifications











