twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైల్డ్ డాగ్ మూవీ ట్విట్టర్ రివ్యూ: నాగ్ ఖాతాలో మరొకటి.. మూవీలో హైలైట్లు ఇవే.. అసలైందే మిస్సైందట!

    |

    చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అక్కినేని అందగాడు కింగ్ నాగార్జున. ఈ మధ్య కాలంలో విజయాన్నే చూడని ఆయన.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం నిజమైన సంఘటనల ఆధారంగా సినిమా చేశాడు. అదే 'వైల్డ్ డాగ్'. బాంబు పేలుళ్ల కేసు ఆధారంగా రూపొందిన ఈ సినిమా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు, ఏపీ తెలంగాణలో బెనిఫిట్ షోలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో 'వైల్డ్ డాగ్' మూవీపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో చూద్దాం పదండి!

    ‘వైల్డ్ డాగ్‌' ఆపరేషన్‌తో వచ్చిన అక్కినేని హీరో

    ‘వైల్డ్ డాగ్‌' ఆపరేషన్‌తో వచ్చిన అక్కినేని హీరో

    అక్కినేని నాగార్జున.. నూతన దర్శకుడు సోలోమన్ తెరకెక్కించిన 'వైల్డ్ డాగ్'లో నటించాడు. ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో దియా మీర్జా, సయామీ కేర్, అతుల్ కులకర్ణి, ఆలీ రెజా, బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం సమకూర్చాడు.

    హైదరాబాద్ పేలుళ్లనే ప్రధానాంశంగా తీసుకుని

    హైదరాబాద్ పేలుళ్లనే ప్రధానాంశంగా తీసుకుని

    హైదరాబాద్‌లోని గోకుల్ చాట్ వద్ద బాంబు పేళ్లుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఆ నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమే 'వైల్డ్ డాగ్'. ఇందులో నాగార్జున ఎన్నైఏ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. బాంబు పేళ్లుళ్ల సూత్రధారుల కోసం జరిగిన ఆపరేషన్‌ను ఈ సినిమాలో చూపించారు. ఈ మూవీ కోసం కొన్ని రియల్ వెపన్స్‌ను కూడా వాడినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

    అలా మిస్సైంది... ఇలా థియేటర్లలోకి వస్తుంది

    అలా మిస్సైంది... ఇలా థియేటర్లలోకి వస్తుంది

    నాగార్జున కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'వైల్డ్ డాగ్'ను మొదట థియేటర్లలోనే విడుదల చేయాలని భావించారు. కానీ, లాక్‌డౌన్ సమయంలో ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు రిలీజ్ హక్కులు అమ్ముకున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో అగ్రిమెంట్‌ను క్యాన్సిల్ చేసుకున్న యూనిట్.. ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.

    ప్రీమియర్.. బెనిఫిట్ షోలకు రెస్పాన్స్ అదుర్స్

    ప్రీమియర్.. బెనిఫిట్ షోలకు రెస్పాన్స్ అదుర్స్

    'వైల్డ్ డాగ్' మూవీ ప్రీమియర్ షోలు ఇప్పటికే యూఎస్‌లో పడిపోయాయి. దానికి సంబంధించిన రిపోర్టులు కూడా ఒక్కొక్కటిగా వస్తున్నాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు కూడా పూర్తయ్యాయి. దీంతో సినిమాను చూసిన వాళ్లంతా ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు చెబుతున్నారు. మొత్తంగా ఈ మూవీకి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వస్తోంది.

    నాగ్ ఖాతాలో మరొకటి.. మొత్తం అతడిదేనట

    నాగ్ ఖాతాలో మరొకటి.. మొత్తం అతడిదేనట

    'వైల్డ్ డాగ్' మూవీ రిపోర్టులను బట్టి ఈ సినిమా నాగార్జునకు పర్‌ఫెక్ట్ కమ్‌బ్యాక్ అంటున్నారు. మూవీ మొత్తాన్ని వన్ మ్యాన్ షోగా మలచుకున్నారని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ అదుర్స్ అనిపించిందట. అంతేకాదు, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కూడా ఆకట్టుకుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో నాగార్జున అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

    మూవీ మొదటి సగం అలా... సెకెండాఫ్ ఇలా

    మూవీ మొదటి సగం అలా... సెకెండాఫ్ ఇలా


    'వైల్డ్ డాగ్' మూవీ చాలా స్లోగా స్టార్ట్ అవుతుందట. అయితే, రాను రానూ కథలో వేగం పుంజుకుని ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేస్తుందని అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బాగుందట. ఇక, సెకెండాఫ్ నుంచి 'ఆపరేషన్ వైల్డ్ డాగ్' ప్రారంభం అవుతుందట. అప్పటి నుంచి మంచి స్క్రీన్ ప్లేతో సినిమా వేగంగా.. ఆసక్తికరంగా సాగుతుందని ప్రేక్షకులు వెల్లడిస్తున్నారు.

    ‘వైల్డ్ డాగ్' మూవీ హైలైట్లు.. మైనస్‌లు ఇవేనట

    ‘వైల్డ్ డాగ్' మూవీ హైలైట్లు.. మైనస్‌లు ఇవేనట

    ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'వైల్డ్ డాగ్' మూవీలో దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చాలా బాగుందట. అలాగే, నాగార్జున పెర్ఫార్మెన్స్, డైరెక్టర్ పనితీరు, యాక్షన్ ఎపిసోడ్స్ ఇందులో హైలైట్లు అని చెబుతున్నారు. అయితే, ఎమోషనల్ టచ్ మిస్ అవ్వడంతో పాటు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ కొంత మిస్ అవడం మైనస్ అని అంటున్నారు. కానీ, ప్రేక్షకులు ఆసక్తిగా చూసే సినిమా అని టాక్.

    English summary
    Akkineni Nagarjuna is an Indian film actor, producer, television presenter, and entrepreneur, who primarily works in Telugu-language films. He has also worked in some Hindi and Tamil language films. He has received nine state Nandi Awards, three Filmfare Awards South and two National Film Awards namely.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X