ఎవర్ గ్రీన్..ఏఎన్ఆర్ : ప్లాటినమ్ జూబ్లీ విశేషాలు

By Bojja Kumar

ప్రపంచ సినీ చరిత్రలో నటునిగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టి.సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్, కమిటీ ఆఫ్ హోస్ట్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సంయుక్తంగా అక్కినేని నాగేశ్వరరావును ఘనంగా సత్కరించాయి. సోమవారం సాయంత్రం శిల్పకళావేదికలో జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖలు హాజరయ్యారు.

ఈ కార్య్రకమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ...'తెలుగు సినీ పరిశ్రమను చెన్నయ్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చిన మహానుభావుడు అక్కినేని నాగేశ్వరరావు. 75 సంవత్సరాలుగటా నటనలో కొనసాగుతున్నారు. ఆయనకు ఈ రంగం పట్ల ఎంత ఆసక్తి ఉందో అర్థం అవుతుంది' అన్నారు.

అక్కినేని మాట్లాడుతూ... తాను అందరి ఆశీర్వాద బలంతోనే ఈ స్థితిలో ఉన్నానని అక్కినేని నాగేశ్వరరావు అన్నారు. అదృష్టం ఒక్కటే నేను ఇక్కడ ఉండటానికి కారణం కాదు. నా కృషి కూడా ఉంది. నా జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఆకులు, పుల్లలు.. ఏరుకుని విస్తరి కుట్టి అన్నం వండుకుని తినటం ఎంత కష్టమో.. ఈ స్థితికి రావడానికి నేను అంతకన్నా ఎక్కువగానే కష్టపడ్డాను. మీ అందరి ఆశీర్వాద బలం వల్లే ఈ స్థితికి చేరుకున్నాను'' అన్నారు.

చిరంజీవి మాట్లాడుతూ...ఇది ఒక వ్యక్తికి జరుగుతున్న సత్కారం కాదు. 75 సంవత్సరాల నట జీవితానికి చేస్తున్న సత్కారమిది. ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటుడు ఏఎన్నార్. నృత్యాల విషయంలో నాకు ఆయనే స్పూర్తి. దసరా బుల్లోడులో ఆయన వేసిన స్టెప్పుల కోసం ఎన్నోసార్లు ఆ చిత్రం చూశాను అని వ్యాఖ్యానించారు. అక్కినేనికి భారతరత్న ఇవ్వాలని సుబ్బరామిరెడ్డి డిమాండ్ చేశారు. అక్కినేని సంపూర్ణ ఆరోగ్యంతో నిండునూరేళ్లూ జీవించాలని డైలాగ్ కింగ్ మోహన్‌బాబు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నార్‌తో స్క్రీన్ పంచుకున్న అలనాటి హీరోయిన్లు అంజలీదేవి, వాణిశ్రీ, భారతి, వైజయంతిమాల, జమున తదితరులతో పాటు ఈతరం నటీనటులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X