twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్కినేని ఆరోగ్యం: కిమ్స్‌లో శస్త్రచికిత్స

    By Srikanya
    |

    హైదరాబాద్‌: ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఆరోగ్యం నిలకడగా ఉంది. తనకు కడుపు నొప్పి రావడంతో అక్టోబరు 8న వైద్యులను సంప్రదించగా... శరీరంలో క్యాన్సర్‌ కణాలు ఉన్నట్లు గుర్తించారని శనివారం మీడియా ముందు అక్కినేని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చికిత్స నిమిత్తం అదేరోజు రాత్రి సికిందరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. ప్రత్యేకంగా ఇద్దరు వైద్యులతో కూడిన బృందం ఆయనకు చికిత్స నిర్వహించింది. శనివారం రాత్రి పేగు చివర మలవిసర్జన ద్వారం వద్ద శస్త్రచికిత్స చేశారు.

    ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందజేస్తున్నామని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కిమ్స్‌ ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో డాక్టర్‌ భాస్కరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్పత్రి వద్ద అక్కినేని నాగార్జున, వెంకట్‌ ఇంకా ఇతర కుటుంబ సభ్యులు అక్కినేనికి తోడుగా ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై సోమవారం పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

    90 ఏళ్ల వయసులోనూ ఎంతో చలాకీగా ఉంటూ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ ఉన్న సినీ లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు అభిమానులను ఈ విషయం కాస్త బాధించే విషయమే. అయితే వేరొకరి ద్వారా ఈ విషయం తెలిసి అభిమానులు బాధ పడకుండా ఉండేందుకు, వారికి ధైర్యం చెప్పేందుకు....ఆయనే స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి అన్నపూర్ణ స్టూడియోలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం వెల్లడించారు.

    అక్కినేని మాట్లాడుతూ...'నాకు అక్టోబర్ 8న కడుపు నొప్పి వచ్చింది, డాక్టర్లు వివిధ రకాల పరీక్షలు చేసిన అనంతరం క్యాన్సర్ కణాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే వృద్ధాప్యంలో క్యాన్సర్ కణాలు చురుకుగా ఉండవని వైద్యులు చెప్పారు. కాబట్టి ఈ వయసులో క్యాన్సర్ రావడం సంతోషించదగ్గ విషయం. నాకు క్యాన్సర్ ఉన్న విషయం తెలిపేందుకే ఈ మీడియా సమావేశం. నేను నటించిన సినిమాల్లో చూపినట్లు ఇదేమీ భయంకరమైన జబ్బు కాదు. క్యాన్సర్‌ను జయించిన వాళ్లు చాలా మంది ఉన్నారు. విజయవంతంగా జీవిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. వారిలో నేనూ ఒకరిని కావొచ్చేమో. నేను ఎక్కువ కాలం బ్రతకాలంటే...మిత్రులు, అభిమానులు, శ్రేయాభిలాషులు బాధపడకుండా, ఈ విషయమై నన్ను అడిగి అడిగి ఇబ్బంది పెట్టకుండా, నాతో ఎప్పుడూ నవ్వుతూ గడపాలని కోరుకుంటున్నాను అన్నారు.

    English summary
    Akkineni Nageswara Rao revealed that doctors found cancer in his body at an early stage. Talking in a press meet, he said that he do not want press to start rumours about his health and revealed it himself.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X