మనసుకు ముడతలు లేని ఎవర్ గ్రీన్ హీరో
ఇంత వయసు వచ్చినా అక్కినేని శరీరానికి, మనసుకు ముడతలు లేవని జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి చమత్కరించారు. ఆకృతి ఆధ్వర్యంలో అక్కినేని 66వ చలనచిత్ర జీవిత మహోత్సవాన్ని మంగళవారం రవీంద్రభారతిలో వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సినారె మాట్లాడుతూ దేవదాసు చిత్రంలోని నటన ఆయనను అగ్రస్థానంలో నిలిపిందని పేర్కొన్నారు. అలాగే అక్కినేని దేవదాసులో విచారవదనాన్ని, దసరా బుల్లోడులో స్టెప్పులతో వైవిద్యాన్ని చూపించగలిగారని జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి చెప్పుకొచ్చారు.
అక్కినేని నాదేశ్వరరావు మాట్లాడుతూ నాకన్న తల్లి జన్మనిస్తే, సినీ, నాటక రంగాలు జీవితాన్ని ఇచ్చాయని చెప్పారు. సినిమాల కోసం 1944లో మద్రాసు వెళ్లానని, అప్పటినుంచి ఇప్పటి వరకు నట జీవితంలో వెను తిరిగి చూడలేదన్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన కర్ణాటక పూర్వ గవర్నర్ వీఎస్ రమాదేవి మాట్లాడుతూ నాగేశ్వరరావు ఓ పద్ధతి కలిగిన వ్యక్తని, ఆయన నిండు నూరేళ్లు జీవించాలని ఆకాక్షించారు. తెలుగువర్సిటీ పూర్వ వీసీ ఆవుల మంజులత మాట్లాడుతూ అక్కినేని సినీ జీవితం నేటి తరం వారికి టెక్స్ట్‌బుక్‌లాంటిదని చెప్పారు.


Click it and Unblock the Notifications











