అక్కినేని భౌతిక ఖాయం తరలిస్తూ నాగార్జున...(ఫోటోలు)
హైదరాబాద్: తెలుగు సినిమా లెజెండ్, దాదా పాల్కే అవార్డు గ్రహీత, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మంగళవారం అర్ధరాత్రి దాటాక మరణించిన సంగతి తెలిసిందే. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను కేర్ ఆసుపత్రికి తరలించినా లాభం లేక పోయింది. ఆయన మరణవార్త విని తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
మంగళవారం అర్ధరాత్రి దాటాక ఆయన వూపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు 2.45 గంటల సమయంలో బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వెంటనే వైద్యులు ఎమర్జెన్సీకి తరలించి ఆక్సిజన్ పెట్టారు. తరువాత పదినిమిషాలకే ఆసుపత్రికి వచ్చిన డా.సోమరాజు వైద్యుల బృందంతో కలసి పరిశీలించారు. అయితే అప్పటికే అక్కినేని శ్వాస ఆగిపోవటంతో ఆయన చనిపోయినట్లు కుటుంబసభ్యులకు తెలిపారు.
దీంతో కుటుంబ సభ్యుల విషాదంలో మునిగిపోయారు. అనంతరం అక్కినేని మృత దేహాన్ని ఆసుపత్రి నుండి అన్నపూర్ణ స్టూడియోకు తరలించారు. అభిమానుల సందర్శనార్థం ఏర్పాట్లు చేసారు. అందుకు సంబంధించిన దృశ్యాలు స్లైడ్ షోలో....

అన్నపూర్ణ స్టూడియోకు తరలిస్తూ...
ఆసుపత్రి నుండి అన్నపూర్ణ స్టూడియోకు అక్కినేని మృతదేహాన్ని తరలిస్తున్న దృశ్యం.

కుటుంబ సభ్యులు
అక్కినేని మృత దేహం తరలిస్తూ....అక్కినేని తనయుడు నాగార్జున, కూతురు నాగ సుశీల, మనవడు సుమంత్ తదితరులు...

ఏఎన్ఆర్
ఆసుపత్రి నుండి తీసుకొచ్చిన అక్కినేని భౌతిక కాయాన్ని వాహనం నుండి క్రిందకి దించుతున్న దృశ్యం.

నాగార్జున, సుమంత్
అక్కినేని నట వారసులు నాగార్జున, సుమంత్ ఆయన చిత్ర పటానికి దండ వేస్తున్న దృశ్యం.

బొట్టు పెడుతూ...
అక్కినేని నాగార్జున తన తండ్రి చిత్రపటానికి బొట్టు పెడుతున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

నాగార్జున...
తండ్రి మరణంతో అక్కినేని నాగార్జున శోక సముద్రంలో మునిగిపోయారు.

నాగ చైతన్య, అఖిల్
తాతయ్య మరణంతో విషాదంలో మునిగి పోయిన ఆయన మనవళ్లు నాగ చైతన్య, అఖిల్

సుశాంత్, అఖిల్
తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయం వద్ద మనవళ్లు సుశాంత్, అఖిల్

సుప్రియ, నాగార్జున
అక్కినేని మృత దేహం వద్ద విషాదంలో ఆయన తనయుడు నాగార్జున, మనవరాలు సుప్రియ

క్యాన్సర్..
అక్కినేని నాగేశ్వరరావు గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు.

గత కొంతకాలంగా క్రిటికల్
అక్కినేని నాగేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











