అక్కినేని మనవరాలు, పవన్ హీరోయిన్ ఇప్పుడు ఇలా... (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: ఒక పదిహేడేళ్లు వెనక్కి వెళితే..... ప్రముఖ దర్శకుడు ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చింది 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' మూవీ. మెగాస్టార్ చిరంజీవి సినీ వారసుడిగా ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ హీరోగా తెరంగ్రేటం చేయగా, అక్కినేని నాగేశ్వర రావు సినీ వారసురాలిగా హీరోయిన్‌గా వెండి తెరరకు పరిచయం అయింది ఆయన మనవరాలు యార్లగడ్డ సుప్రియ.
అయితే ఈ ఇద్దరు నటించిన ఆ సినిమా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఆ తర్వాత సుప్రియ పూర్తిగా సినిమాలకు దూరం అయింది. ఆ తర్వాత చరన్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. పవన్ కళ్యాన్ మాత్రం సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఆయన పొజిషన్ ఏమిటో అందరికీ తెలిసిందే.
సుప్రియ విషయానికొస్తే.... సినిమాలకు దూరమైన తర్వాత ఆమె ఎక్కువగా లైమ్ లైట్ లోకి రాలేదు. తాజాగా ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఎఎన్ఆర్ నేషనల్ అవార్డు ఫంక్షన్లో సుప్రియ కనిపించింది. ఆమె ఇప్పుడు ఎలా ఉందో ఓ లుక్కేయండి మరి....

అక్కినేని మనవరాలు సుప్రియ.

ఎఎన్ఆర్ అవార్డ్ ఫంక్షన్లో తాతయ్యతో కలిసి సుప్రియ.

నాగచైతన్యలతో కలిసి ఎఎన్ఆర్ నేషనల్ అవార్డు ఫంక్షన్లో సుప్రియ.

హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ్ తో కలిసి సుప్రియ.

పవన్, సుప్రియ తొలి మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ పోస్టర్.


Click it and Unblock the Notifications










