అక్కినేని కండీషన్ క్రిటికల్?

రెండురోజుల క్రితం బాగా నీరసపడి అస్వస్థతకు గురికావడంతో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికే ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి వైద్యులు వచ్చి వైద్యం అందిస్తున్నారు. ఆయన కుమారుడైన సినీహీరో అక్కినేని నాగార్జున, ఇతర కుటుంబ సభ్యులు రోజూ నాగేశ్వరరావు ఇంటికి వచ్చి, కొన్ని గంటలపాటు అక్కడే ఉండి వెళుతున్నారు. అక్కినేని ఆరోగ్య పరిస్థితి, వైద్యానికి సంబంధించి వివరాలు తెలియజేయడానికి ఆయన కుటుంబసభ్యులు ఇష్టపడటం లేదు.
క్రిందటి నెలలో నాగేశ్వరరావు శరీరంలో క్యాన్సర్ కణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అక్కినేని స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది సాధారణ జబ్బే, పైగా వృద్ధాప్యంలో రావడం ఆనందించ దగ్గ విషయమే, ఈ వయసులో క్యాన్సర్ కణాల వ్యాప్తి నెమ్మదిగా ఉంటుందని నాగేశ్వరరావు తెలిపారు.


Click it and Unblock the Notifications











