»   » హీరోయిన్ 'బ్రెస్ట్స్' అక్కినేని కామెంట్

హీరోయిన్ 'బ్రెస్ట్స్' అక్కినేని కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వయస్సు మీదపడటం వల్లో మెరేమో కానీ అక్కినేని నాగేశ్వరరావు ఈ మధ్యన ఏ సినిమా ఫంక్షన్ కి వెళ్లినా గంటల తరబడి మాట్లాడటం,అందులో అసభ్య పదజాలం ఉపయోగించటం పరిపాటి అయిపోయింది.శ్రీరామరాజ్యం అడియో పంక్షన్ లో ''హింస, అరకొర దుస్తుల భామలు చేసే నృత్యాలున్న సినిమాల్ని చూస్తున్నారు. ఇలాంటి సమయంలో భక్తిభావ చిత్రాలు తీస్తే ఎవరు చూస్తారని నిర్మాతని హెచ్చరించాను అని ఆశ్చర్యపరిచారు.అలాగే అంతకుముందు జరిగిన ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన 'దగ్గరగా.. దూరంగా...' ఆడియో వేడుకలో మరో సందర్భం చోటు చేసుకుంది. ఆ పంక్షన్ లో అందరికంటే చివరగా మాట్లాడిన అక్కినేని తన మాటలతో అందరినీ షాక్ కు గురి చేసారు.

ప్రసంగం మధ్యలో అకస్మాత్తుగా 'అమాయకురాలు' సినిమా సంగతి ప్రస్తావిస్తూ అందులో హీరోయిన్ కాంచనని తను హత్తుకునే సన్నివేశం గురించి చెప్పుకొచ్చారు. "ఆ సమయంలో నిర్మాత మధుసూదనరావు గారు లేరు. నేను, కాంచన ఒకరినొకరం తన్మయత్వంతో గట్టిగా హత్తుకోవాలి. ఆ సీనులో ఆమె 'బ్రెస్ట్స్'కదిలాయి. ఈ సంగతి నాకెలా తెలుస్తుంది? రషెస్ చూసిన మధుసూదనరావు గారు నన్ను పిలిచారు. 'నీకు బుద్ధుందా? అంత గట్టిగా వత్తుకోవాలా? ఆ బ్రెస్ట్స్ చూడు ఎలా కదిలాయో. చూసుకోవద్దా?' అనరిచారు.

అప్పట్లో అసభ్యతకు తావు లేకుండా అంత జాగ్రత్త తీసుకునేవారు. ఇప్పుడు అలాంటివేమీ లేవు. అయినా ఇప్పుటి హీరోయిన్లవి కదులుతున్నా అవి నిజమైనవో, కాదో.. ఇప్పుడు కృత్రిమమైనవేవో తొడుక్కుంటున్నారుగా" అని చెప్పుకొచ్చారు.ఆయన ఈ మాటలు చెప్పేప్పుడు ఆయన పక్కనే ఆ సినిమా హీరోయిన్ వేదిక ఉంది. వేడుకకి వచ్చిన వాళ్లలో ఆడవాళ్లు ఉన్నారు వారంతా ఒక్కసారిగా ఆయన మాటలకు ఆశ్చర్యపోయి తలదించుకున్నారు. ప్రస్తుతం అక్కేనేని బాపు 'శ్రీరామరాజ్యం'లో వాల్మీకిగా నటిస్తున్నారు.

English summary
Akkineni Nageswara Rao launched the audio cassettes and CD’s of Daggaraga Dooranga and presented the first copy to Mohan Babu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu