నాకు 25 ..నాగ్ కి 15, నాగచైతన్యకు రెండే..ఎఎన్నార్
నా మనవడు నాగచైతన్య రెండు చిత్రాలతోనే నన్ను, నాగార్జునను అధిగమించాడు. నాకు గుర్తింపు రావడానికి 25 చిత్రాలు పడితే...మా అబ్బాయి నాగార్జునకు 15 సినిమాల తరువాత పేరొచ్చింది అని అక్కినేని నాగేశ్వరరావు అన్నారు. అభినందన అక్కినేని చలనచిత్ర పురస్కారాలు 2010 మంగళవారం రవీంద్రభారతిలో ఘనంగా జరింగింది. ఈ సందర్భంగా అక్కినేని మాట్లాడుతూ తన మనవడు గురించి పై స్పందించారు. అలాగే సినిమా విజయంలో నిర్మాతే కీలకమన్నారు. చిత్రానికి తల్లి, తండ్రి అతడేనన్నారు.
అనతరం ప్రముఖ నిర్మాత రామానాయుడు మాట్లాడుతూ...నాగచైతన్య మంచి ప్రతిభ కనబర్చాడని, నెంబర్ వన్ స్థానానికి ఎదిగేందుకు కృషిచేయాలని సూచించారు. తర్వాత నాగచైతన్య మాట్లాడుతూ..అభిమానుల ప్రోత్సాహంతో మరింత శ్రమించి వైవిధ్యమైన పాత్రలు పోషిస్తానని అన్నారు. ఇక ఉత్తమ ప్రేమకథా చిత్రంగా ఎంపికైన ఏమాయ చేశావే హీరో, హీరోయిన్స్ నాగచైతన్య, సమంతలను ఈ సందర్భంగా అక్కినేని, మూవీ మొఘల్ రామానాయుడు సత్కరించారు. వీరితో పాటు ప్రతిభ కనబరిచిన నటుడు కృష్ణుడు, పాటల రచయిత అనంతశ్రీరామ్, మాటల రచయిత అనురాధలకు కూడా అవార్డులను ప్రదానం చేశారు.


Click it and Unblock the Notifications











