త్రిషతో సరసమాడిన ఎ.ఎన్.ఆర్

తాత మనమరాలితో సరసమాడవచ్చంటారు కాబట్టి తాను త్రిషతో డాన్స్ చేయటానికి రెడీగా ఉన్నానని అన్నారు. అలాగే తానే తెలుగు,హిందీ సినిమా లకు డాన్స్ నేర్పినవాడినని, ఆ విషయం ఆమె తెలుసుకోవాలని ఆయన ఉవ్విళ్ళూరుతూ అన్నారు. అలాగే త్రిష సినిమాలు చాలా చూసానని,ఆమెను చూస్తే మీకెలా ఉంటుందో కానీ నాకు మాత్రం చాలా బాగుంటుందంటూ సరసమాడారు. అంతేనా నువ్వు వస్తానంటే నే వద్దంటానా అని పిలిచింది నన్ను కాదు సుమా వానని అని అందరిని నవ్వించారు. అక్కడికి వచ్చిన వారంతా ఇది చూసి అక్కినేని శరీరం వయస్సు పెర్గుతూంటే మనస్సు వయస్సు చిన్నదవుతోందని చెప్పుకున్నారు.


Click it and Unblock the Notifications











