అక్కినేని సతీమణి కన్నుమూత
సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు సతీమణి అన్నపూర్ణ బుధవారం మధ్యాహ్నం కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె ఈ రోజు తుది శ్వాస విడిచారు. అన్నపూర్ణ మరణంతో అక్కినేని కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలిసిన వెంటనే కుటుంబంలోని వారంతా షూటింగులు కేన్సిల్ చేసుకుని ఇంటికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం నాగార్జున బెంగుళూరులో ఉన్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగులో ఉన్నాడు. అక్కినేని కుటుంబానికి చెందిన సినీ స్టూడియో 'అన్న పూర్ణ' పేరు మీ నిర్మించిన విషయం తెలిసిందే.
నాగార్జునకు నాన్న అక్కనేని కంటే అమ్మ అన్నపూర్ణ అంటే చాలా ఇష్టం. ఈ విషయం ఎన్నో సందర్భాల్లో నాగార్జున మీడియాతో వెల్లడించారు. అన్నపూర్ణ మరణ వార్తతో ఇటు అక్కినేని అభిమానుల్లోనూ విషాదం నెలకొంది.


Click it and Unblock the Notifications











