»   » నాగబాబూ., వర్మా.. మధ్యలో ఒక అక్కుపక్షీ.. : గూగుల్ లో మోస్ట్ వాంటెడ్ పదం Akku Pakshi

నాగబాబూ., వర్మా.. మధ్యలో ఒక అక్కుపక్షీ.. : గూగుల్ లో మోస్ట్ వాంటెడ్ పదం Akku Pakshi

Posted By:
Subscribe to Filmibeat Telugu

రీమేక్ సినిమాలు తీస్తే తప్పేంటని, చిరంజీవి నటించిన పలు చిత్రాలు ఇతర భాషల్లో రూపొందాయని ఈ సందర్భంగా నాగబాబు వ్యాఖ్యానించారు. తెలుగు సినిమా పరిశ్రమ నుండి ముంబై వెళ్లి అక్కడ సినిమాలు తీసుకుంటున్న ఒకడు ట్విట్టర్లొ ఎప్పడూ ఏదో ఒకటి వాగుతుంటాడు, వాడో అక్కు పక్షి...వాడికి ఇపుడు సినిమాలు తీయడం చేతకావడంలేదు, పిచ్చికూతలు కూస్తున్నాడు. సరిగా సినిమా తీయడం కూడా రాదు.

ముందు వాడు మంచి సినిమాలు తీయడంపై దృష్టి పెడితే బాగుంటుందని హెచ్చరించారు. ఎవరేం చేసినా హిట్టయ్యే సినిమాను ఆపలేరు...ఫెయిలయ్యే సినిమాను లేపలేరు. వాడు అక్కుప‌క్షి... వాడు స‌న్నాసి... చిరంజీవి 150వ సినిమా ఎలా ఉండాలి అని ఎక్క‌డో కూర్చొని ట్వీట్‌లు వెయ్యడం కాదు... ముందు నీ సంగ‌తి తెలుసుకో. వాడి సినిమాలు స‌రిగా ఆడ‌డం లేదు. ఒక‌ప్పుడు బావుండేవి. ఇప్పుడు వాడు హిట్ కొట్టి చెప్ప‌మ‌నండి. ముంబైలో కూర్చొని అక్క‌డ బాంబులు వేసుకోమ‌నండి వాడిని. ఇలా... ఓ స్థాయిలో వ‌ర్మ‌పై దుమ్మెత్తిపోశాడు.

Akkupakshi is now Trending word in Google

వెంటనే వర్మకూడా అదే స్థాయిలో తిరగబడి ట్వీట్ల యుద్దం చేసాడనుకోండి అయితే ఇక్కడ విపరీతమైన పాపులారిటీ వచ్చిన ఒకరున్నారు. అది నాగ బాబు, రామ్ గోపాల్ వర్మలు మాత్రం కాదు అలా అని చిరంజీవి, రామ్ చరణ్ కూడా కాదు... అసలు అంత పాపులారిటీ ఇంతవరకూ ఎన్నడూ రలేదు కానీ నాగబాబు, వర్మల వివాదం వల్ల అంతగా పాపులారిటీ ఎవరికి వచ్చిందో తెలుసా "అక్కు పక్షి" కి...

Akkupakshi is now Trending word in Google

మీరు చదివింది నిజమే కావాలంటే ఒకసారి గూగుల్ లోకి వెళ్ళి AKKU PAKSHI అని టైప్ చేసి చూడండి. అంతే కాదు వర్మ పెట్టిన ప్రతీ ట్వీట్ కిందా చాలమంది వర్మ మొహాన్ని పక్షి తలలకు కలిపి మార్ఫ్ చేసిన ఫొటోలని కూడా పోస్ట్ చేస్తున్నారు. దీంతో అసలు అందరికన్నా ఈ అక్కుపక్షి మరీ పాపులర్ అయ్యింది. కావాలంటే ఓసారి గూగుల్ లో కొట్టి చూడండి...

English summary
After Nagababu speech on Ram gopal Varma.. Akkupakshi is now Trending word in Google
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu