రెమ్యునేషన్ ని పెళ్లి కోసం దాస్తోందిట
ఇప్పటికీ నా సంపాదన అంతా మా అమ్మానాన్నల చేతుల్లో పెడతాను. వాళ్లేం ఖర్చుపెట్టేయడం లేదు. 'నీ పెళ్లి కోసం దాస్తున్నాం..' అని చెప్పారు అంటోంది హీరోయిన్ అక్ష. 'రైడ్', 'యువత' సినిమాలతో తెలుగు ప్రేక్షకుల పరిచయమైన అక్ష ప్రస్తుతం కందిరీగ సినిమాలో నటిస్తోంది.రామ్ హీరోగా చేసే ఈ చిత్రంలో హన్సిక మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది. ఇక తన కెరీర్ గురించి చెపుతూ.. నేనిప్పటి వరకూ చేసినవి మూడే మూడు సినిమాలు. ఛాన్స్ కోసం ఎదురుచూడటమే తప్ప... సినిమాల్ని ఎంపిక చేసుకొనే పరిస్థితుల్లో లేను. వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా అందిపుచ్చుకొంటే సరిపోతుంది అంది. అలా ఎదురు చూస్తే వయస్సు అయిపోతుంది కదా అంటే...నా వయసెంత అనుకొన్నారు... ఆ మధ్యే పందొమ్మిది వచ్చాయి. నే నింకా చిన్నపిల్లనే అంది.


Click it and Unblock the Notifications











