క్రేజీ : శ్రీదేవి కుమార్తెగా... కమల్‌ కూతురు!

By Srikanya

హైదరాబాద్ :కమల్‌, శ్రీదేవి జంటగా 22 సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కుమార్తె...శ్రీదేవి కుమార్తెగా కమల్ హాసన్ రెండో కూతురు కనిపించనుంది. ఈ కాంబినేషన్ కు క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రమని చెప్తున్నారు. ఈ చిత్రానికి బోనీ కపూర్ నిర్మత కావటం మరో విశేషం.

''సవతి తల్లి, సవతి కూతురు మధ్య నడిచే కథ ఇది. బోనీకపూర్‌ అక్షరను 'షమితాబ్‌' ప్రచార చిత్రాల్లో చూశారట. ఆయనకు నచ్చడంతో ఈ సినిమాకు ఎంచుకున్నార''ని చెప్తున్నారు.

'ఇంగ్లిష్‌ వింగ్లిష్‌'తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు శ్రీదేవి. అప్పటి నుంచి సినిమాల ఎంపిక విషయంలో వైవిధ్యం ప్రదర్శిస్తున్నారు. తాజాగా రవి ఉదయవర్‌ అనే వాణిజ్య ప్రకటనల రూపకర్త దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. బోనీ కపూర్‌ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తారు. ఇందులో శ్రీదేవి కూతురుగా కమల్‌హాసన్‌ చిన్న కుమార్తె అక్షర హాసన్‌ నటించనుందని సమాచారం.

Akshara Haasan to play Sridevi's daughter; Ad-man Ravi Udyawar to direct

ఇదే కాకుండా....

విజయ్ హీరోగా శింబుదేవన్‌ దర్శకత్వం వహిస్తున్న ఓ ఫాంటసీ చిత్రంలో శ్రీదేవి కీలకపాత్రలో నటిస్తోంది. ఇందులో పాలబుగ్గల సుందరి హన్సిక రాకుమారి పాత్రలో కనిపించబో తోంది. రాకుమారికి తల్లిపాత్రలో శ్రీదేవి నటిస్తోంది. విజయ్ సరసన శృతిహాసన్‌ ప్రధాన నాయికగా నటిస్తోంది. ప్రస్తుతం చెన్నయ్ శివారులో దాదాపు 16 ఎకరాల్లో భారీ సెట్‌ వేసి అందులో చిత్రీకరణకు సిద్ధమవుతున్నారని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌' తరవాత మళ్లీ కెమెరా ముందుకు రాలేదు శ్రీదేవి. ఆమె కోసం ఎన్ని పాత్రలు సిద్ధమైనా తొందర పడలేదు. ఎట్టకేలకు ఓ సినిమాపై సంతకం చేసిందని సమాచారం. తమిళ దర్శకుడు చింబుదేవన్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్‌ హీరో. ఈ చిత్రంలో హీరోయిన్ గా హన్సికను ఎంచుకొన్నట్టు తెలుస్తుంది. హీరోయిన్ తల్లి పాత్ర కూడా కథలో కీలకమేనట. ఆ పాత్రలో నటించడానికి శ్రీదేవి అంగీకరించారని తమిళ చిత్రవర్గాలు చెబుతున్నాయి.

సుదీప్‌ మరో కీలక పాత్రలో కనిపించే ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ''శ్రీదేవిని సంప్రదించిన మాట నిజమే. త్వరలో ఆమె నిర్ణయాన్ని వెల్లడిస్తారు. అంత వరకూ కాస్త ఓపిక పట్టండి'' అని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.

చిత్రం విషయానికి వస్త్తే...

విజయ్... ఈ దీపావళికి కత్తిలా తెరపైకి వచ్చి హిట్ కొట్టారు. తాజాగా మారీశన్‌గా మారడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఎస్.విజయ్ తదుపరి చిత్రం మారీశన్ అనే పేరు పరిశీలనలో ఉంది. వడవేలును హీరోగా చేసి హింసై అరసన్ 23ఆమ్ పులికేసి చిత్రాన్ని తెరకెక్కించి విజయం సాధించిన యువ దర్శకుడు శింబుదేవన్ విజయ్‌ను డెరైక్ట్ చేయనున్న చిత్రం మారీశన్.

క్రేజి ముద్దుగుమ్మలు హన్సిక, శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించనున్నారు. శ్రీదేవి, కన్నడ నటుడు సుదీప్ ప్రధాన పాత్రలు పోషించనునన్నారు. ఈ చిత్రం ఫాంటసీ కథాంశంతో తెరకెక్కనుంది. ఈ కథను మొదట ధనుష్‌తో చేయూలని అనుకున్నట్టు ప్రచారం జరిగింది. తర్వాత ఏమైందోగాని మారీశన్‌గా విజయ్ మారుతున్నారు.

దీన్ని ఆయన వద్ద చాలా ఏళ్లుగా పీఆర్‌వోగా పనిచేస్తున్న పి.టి.సెల్వకుమార్ నిర్మించనున్నారు. ఛాయాగ్రహణను నటరాజన్ అందించనున్నారు. దీన్ని సరస్సులు, పర్వతాలు, అందమైన పూతోటలు అంటూ అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని సుందరమైన ప్రాంతాల్లో మారీశన్‌ను రూపొందించనున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X